నంద్యాలకు పారా మిలటరీ బలగాలు

First Published Aug 8, 2017, 7:29 AM IST
Highlights
  • నంద్యాల ఉపఎన్నికలో కేంద్రబలగాలను రంగంలోకి దింపాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
  • రాష్ట్రప్రభుత్వానికి చెందిన పోలీసు బలగాలపై నమ్మకం లేదంటూ వైసీపీ చేసిన ఫిర్యాదు మేరకు ఇ సి సానుకూలంగా స్పందించటం గమనార్హం.
  • నిజంగా ఇ సి నిర్ణయం ప్రభుత్వానికి చెంపపెట్టే.
  • ఎన్నిక మొత్తం కేంద్ర బలగాల కనుసన్నల్లోనే జరపాలని తాజాగా ఎన్నికల సంఘం నిర్ణయించింది.

నంద్యాల ఉపఎన్నికలో కేంద్రబలగాలను రంగంలోకి దింపాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాష్ట్రప్రభుత్వానికి చెందిన పోలీసు బలగాలపై నమ్మకం లేదంటూ వైసీపీ చేసిన ఫిర్యాదు మేరకు ఇ సి సానుకూలంగా స్పందించటం గమనార్హం. నిజంగా ఇ సి నిర్ణయం ప్రభుత్వానికి చెంపపెట్టే. ఎన్నిక మొత్తం కేంద్ర బలగాల కనుసన్నల్లోనే జరపాలని తాజాగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. స్ధానిక పోలీసులను సాధారణ విధులకు మాత్రమే ఉపయోగించుకోవాలని ఇ సి తీసుకున్న నిర్ణయంతో టిడిపికి ఇబ్బందే. అంటే ప్రతీ పోలింగ్ బూత్ పరిధిలోనూ కేంద్ర బలగాలు మాత్రమే ఉంటాయి.

నిబంధనల ప్రకారం పోలింగ్ బూత్ లోకి ఓటర్లను, అభ్యర్ధిని, అభ్యర్ధి తరపు ప్రధాన ఏజెంటును మాత్రమే అనుమతిస్తారు. వీరు మినహా ఇంకెవరన్నా పోలింగ్ బూత్ లోకి వెళ్లాలంటే పోలీసులు అనుమతించకూడదు. కానీ నిబంధనలకు భిన్నంగానే జరుగుతుంటూంది. ఎక్కడైనా అధికారపార్టీ నేతలకే పోలీసుల వత్తాసుంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే ముందుజాగ్రత్తగా వైసీపీ ఇదే విషయాన్ని ఇ సి వద్ద ఫిర్యాదు చేసింది. అసలే, నంద్యాల ఉపఎన్నిక ఇరుపార్టీలకూ ప్రతిష్టగా మారింది. దానికితోడు ఇప్పటి వరకూ స్ధానిక అధికారులు టిడిపి చెప్పినట్లు ఆటాడుతున్నారు.

ఇ సి నిర్ణయం ప్రకారం మరో మూడు రోజుల్లో 7 కంపెనీల పారా మిలటరీ బలగాలు నంద్యాలకు రానున్నాయి. ప్రతీ పోలింగ్ బూత్ కు పారా మిలటరీ కాపలా వల్ల అధికార పార్టీ ఆటలు సాగవన్నది బహిరంగ వాస్తవం. తమ ఫిర్యాదుకు సానుకూలంగా స్పందించటం పట్ల వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి, టిడిపి ఏం చేస్తుందో చూడాలి.

click me!