వైసీపీలో చేరిన టీడీపీ మాజీ నేత శోభా హైమావతి.. సీఎం సంక్షేమ పథకాలు నచ్చే చేరానంటూ...

By SumaBala BukkaFirst Published Jan 28, 2022, 8:04 AM IST
Highlights

 తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియా పాయింట్ లో విలేకరులతో శోభా హైమవతి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరానని వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. పేద మహిళలందరికీ ప్రభుత్వ సాయం అందుతోందన్నారు. గిరిజన మహిళకు డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చి గౌరవించారన్నారు. 

అమరావతి : ముఖ్యమంత్రి YS Jagan Mohan Reddy అమలు చేస్తున్న Welfare and development programs నచ్చి వెఎస్సార్ సీపీలోకి వచ్చానని విజయనగరం జిల్లా ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే, TDP రాష్ట్ర మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు Shobha Haimawati తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియా పాయింట్ లో విలేకరులతో శోభా హైమవతి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరానని వెల్లడించారు. 

సీఎం వైఎస్ జగన్ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. పేద మహిళలందరికీ ప్రభుత్వ సాయం అందుతోందన్నారు. గిరిజన మహిళకు డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చి గౌరవించారన్నారు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కావాల్సిన అన్న సౌకర్యాలు సీఎం జగన్ ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. 

మన్యం వీరుడు అల్లూరి పేరుతో జిల్లా ఏర్పాటు చేయడం మీద హర్షం వ్యక్తం అవుతోందని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ నేతల్లో సగం మంది వైెస్సార్ సీపీలో చేరుతారని ఆయన చెప్పారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మాజీ ఎంపీ డాక్టర్ డీవీజీ శంకరరావు కూడా సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. 

కాగా, శోభా హైమవతి నిరుడు జూలై లోనే టీడీపీకి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబుకు షాక్ తగిలింగిది. మాజీ ఎమ్మెల్యే శోభా హైమవతి టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు తగిన గుర్తింపు లేదనే మనోవేదనతో ఆమె టీడీపీని వీడారు. పార్టీ కోసం కష్టపడుతున్నవారిని పక్కన పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎస్ కోట నుంచి ఆమె గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ అనుబంధ మహిళా విభాగం తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షరాలిగా కూడా ఆమె పనిచేశారు.  పార్టీలో జరుగుతున్న పరిణామాలను భరించలేక తాను రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. శోభా హైమవతి త్వరలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. టీడీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. కొంత మంది నాయకులు ఇప్పటికే పార్టీని వీడారు.

మరోవైపు తెలంగాణలో కూడా టీడీపీ భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఏకంగా టీడీపీ తెలంగాణ రాష్ట్రాధ్యక్షుడు ఎల్ రమణ టీఆర్ఎస్ లో చేరారు. దీంతో తెలంగాణలో టీడీపీ మరింతగా సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. దాదాపుగా టీడీపీ తుడిచిపెట్టుకుపోయినట్లుగా భావిస్తున్నారు. 

click me!