విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు కావాలా... డిమాండ్ వుంటే చెప్పండి: పేర్ని నాని

By Siva KodatiFirst Published Jan 27, 2022, 9:42 PM IST
Highlights

విజయవాడ జిల్లాకు (vijayawada district) వంగవీటి మోహన రంగా (vangaveeti mohana ranga) పేరు పెట్టాలనే డిమాండ్ వస్తే చెప్పాలని పేర్ని నాని తెలిపారు. మెజారిటీ ప్రజల ఆమోదాన్నే పరిగణనలోకి తీసుకుంటామన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.  

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన జిల్లా కేంద్రాలు, పునర్‌వ్యవస్థీకరణపై (new districts) పలు చోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అనేక చోట్ల ప్రజలు ఆందోళనకు దిగారు. సీఎం జగన్ సొంత జిల్లాలో అన్నమయ్య జిల్లా (annamayya district) ఏర్పాటుపై రాజంపేట వాసులు భగ్గుమంటున్నారు. లోక్‌సభ నియోజకవర్గంగా వున్న రాజంపేటను కాదని.. రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అటు కృష్ణా జిల్లాలో విజయవాడ కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడంపైనా వివాదం రాజుకుంది. 

ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలుంటే చెప్పాలని మంత్రి పేర్ని నాని (perni nani) రాష్ట్ర ప్రజలకు సూచించారు. గతంలో ప్రజలకు అందుబాటులో లేకుండా జిల్లా కేంద్రాలు ఉండేవని ఆయన అన్నారు. విజయవాడ జిల్లాకు (vijayawada district) వంగవీటి మోహన రంగా (vangaveeti mohana ranga) పేరు పెట్టాలనే డిమాండ్ వస్తే చెప్పాలని పేర్ని నాని తెలిపారు. మెజారిటీ ప్రజల ఆమోదాన్నే పరిగణనలోకి తీసుకుంటామన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.  

మరోవైపు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టాలని కృష్ణా జిల్లా ప్రజలు పాదయాత్రలో సీఎం జగన్‌ను కోరారని మరో మంత్రి కొడాలి నాని అన్నారు. అందుకే ఒక జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడతానని జగన్ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. జిల్లాల పునర్విభజన ప్రక్రియలో మార్పులు, చేర్పులకు అవకాశం ఇచ్చినట్లు కొడాలి నాని తెలిపారు. తమ వద్దకు వచ్చిన అభ్యంతరాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆయన స్పష్టం చేశారు. 

గ్రామ సచివాలయ వ్యవస్థతో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని మంత్రి వెల్లడించారు. అధికార వింకేంద్రీకరణ కోసమే 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని.. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసమే జిల్లాల పునర్వ్యస్ధీకరణ చేపట్టామని కొడాలి నాని తెలిపారు. గత ప్రభుత్వాలు చేయలేని సంక్షేమ పాలన జగన్ అందిస్తున్నారని మంత్రి కొనియాడారు. కృష్ణా జిల్లాకు (krishna district) ఎన్టీఆర్ పేరు పెట్టాలని నిమ్మకూరు వాసులు కోరారని.. ఎన్టీఆర్ (ntr) అభిమానుల తరపున సీఎం జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

కాగా.. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రి మండలి మంగళవారం నాడు ఆమోదం  తెలిపింది. ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం Notification  విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ పై ప్రజలు తమ సూచనలు,సలహాలతో పాటు అభిప్రాయాలను తెలపాలని ప్రభుత్వం కోరింది. వచ్చే నెల 26వ తేదీ వరకు ప్రజలకు గడువును ఇచ్చింది. ఉగాది నుండి కొత్త జిల్లాల నుండి పాలన సాగించాలని జగన్ సర్కార్ తలపెట్టింది. ఇదే విషయాన్ని రిపబ్లిక్ డే ఉత్సవాల్లో కూడా గవర్నర్ ప్రస్తావించారు.
 

click me!