కొత్త జిల్లాల ప్రకటనను స్వాగతించిన బాలకృష్ణ.. హిందూపురం విషయంలో కొత్త ప్రతిపాదన..

By SumaBala BukkaFirst Published Jan 28, 2022, 7:43 AM IST
Highlights

 గురువారం బాలకృష్ణ ఓ వీడియో విడుదల చేశారు. జిల్లా కేంద్రానికి ఉండాల్సిన అన్ని అర్హతలు హిందూపురానికి ఉన్నాయన్నారు. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భూములు పుష్కలంగా ఉన్నాయని గుర్తు చేశారు. హిందూపురం పట్టణ ప్రజల మనోభావాలను గౌరవించి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. 

హిందూపురం : పాలనా సౌలభ్యం కోసం andhrapradesh state governament కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు హిందూపురం TDP MLA, ప్రముఖ సినీ నటుడుNandamuri Balakrishna తెలిపారు. అయితే Satyasai Districtను Hindupuram కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు గురువారం బాలకృష్ణ ఓ వీడియో విడుదల చేశారు. 

జిల్లా కేంద్రానికి ఉండాల్సిన అన్ని అర్హతలు హిందూపురానికి ఉన్నాయన్నారు. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భూములు పుష్కలంగా ఉన్నాయని గుర్తు చేశారు. హిందూపురం పట్టణ ప్రజల మనోభావాలను గౌరవించి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. 

కాగా, జనవరి 26న రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.  వచ్చే ఉగాది నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలన్న ప్రతిపాదనకు లోబడుతూనే…  భౌగోళిక,  సామాజిక,  సాంస్కృతిక  పరిస్థితుల్ని,  సౌలభ్యాలను  దృష్టిలో ఉంచుకుని  కొత్త జిల్లాల సరిహద్దులు నిర్ణయించడంలో ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించింది.

రాష్ట్రంలో మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉండగా,  అరకు లోక్సభ స్థానం భౌగోళిక విస్తీర్ణం చాలా పెద్దది కావడంతో..  దాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారు. మంగళవారం రాత్రి 8 గంటలకు ఆన్లైన్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు.  ముఖ్య మంత్రి ధర్మాన కృష్ణదాస్  కొత్త జిల్లాల ప్రతిపాదనను మంత్రివర్గం ముందు ఉంచారు.  మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.

ఈ సమావేశానికి ముందు మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.  కొత్త జిల్లాల ప్రక్రియ గురించి వారికి వివరించి అభిప్రాయాలు సూచనలు తీసుకున్నారు.

ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పాటవుతున్న జిల్లాలు
- ఒంగోలు ( బాపట్ల పరిధిలోని సంతనూతలపాడు ఒంగోలు లో కలిపారు)
-  కర్నూలు ( నంద్యాల నంద్యాల పరిధిలో పాణ్యం నియోజకవర్గాన్ని కర్నూలు  జిల్లాలొకి తెచ్చారు)
- శ్రీకాకుళం  ( విజయనగరం లోక్సభ స్థానం పరిధిలోని ఎచ్చెర్ల శ్రీకాకుళం లో కలిపారు)
 - అనంతపురం జిల్లాలో ఆ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు రాప్తాడును చేర్చారు.

 ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పాటవుతున్న జిల్లాలు…

 - నంద్యాల ( దీనిపరిధిలోని పాణ్యంను  కర్నూలు లో కలిపారు)
- విశాఖపట్నం ( దీనిపరిధిలోని  ఎస్ కోటను  కోట విజయనగరం లో కలిపారు)
- భౌగోళికంగా సుదీర్ఘ ప్రాంతం,  పూర్తి గిరిజన జనాభా తో కూడిన రెండుగా విభజించి, రెండు జిల్లాలు చేశారు.  అయితే అయితే జిల్లాకు అరకు పేరు పెట్టలేదు. అరకు ను జిల్లా కేంద్రంగా కూడా చేయలేదు. 

- వాటిలో అల్లూరి సీతారామరాజు పేరు తో పాడేరు కేంద్రంగా ఏర్పాటవుతున్న జిల్లాలో మూడే అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

- పార్వతీపురం కేంద్రంగా ఏర్పాటు అవుతుందని జిల్లాల్లో నాలుగే అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

- రాజంపేట లోక్సభ నియోజకవర్గం పరిధిగా ఏర్పాటవుతున్న  జిల్లాకి..   జిల్లా పేరు గాని,  జిల్లా కేంద్రం గానీ  రాజంపేట కాదు.  జిల్లాపేరు  అన్నమయ్యగా పెట్టారు.  రాయచోటినీ జిల్లా కేంద్రంగా చేయనున్నారు.

 - కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా 15 రెవెన్యూ డివిజన్లను ప్రతిపాదించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య 62కు చేరుతుంది. 

click me!