బ్రేకింగ్: ఈ నెల 28న వైసీపీలోకి పంచకర్ల రమేశ్ బాబు

Siva Kodati |  
Published : Aug 26, 2020, 09:22 PM IST
బ్రేకింగ్: ఈ నెల 28న వైసీపీలోకి పంచకర్ల రమేశ్ బాబు

సారాంశం

ఉత్తరాంధ్రలో కీలకనేతగా ఉన్న టీడీపీ మాజీ నేత, యలమంచిలి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖాయం చేసుకున్నారు. 

ఉత్తరాంధ్రలో కీలకనేతగా ఉన్న టీడీపీ మాజీ నేత, యలమంచిలి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖాయం చేసుకున్నారు. ఈ నెల 28న రమేశ్ వైసీపీలో చేరనున్నారు.

ఆ రోజు మధ్యాహ్నం తాడేపల్లిలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పంచకర్ల రమేశ్ బాబు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరనున్నారు.

2014 ఎన్నికల్లో విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్‌పై గెలిచిన రమేశ్ బాబు.. ఆ తర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పంచకర్ల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోఈ ఏడాది మార్చిలో టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu