ఏపీ కరోనా బులెటిన్: కొత్తగా 10,830 కేసులు, 81 మరణాలు

By Siva KodatiFirst Published Aug 26, 2020, 7:47 PM IST
Highlights

ఏపీలో మరోసారి 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మంగళవారం కొత్తగా 10,830 మందికి పాజిటివ్‌గా తేలడంతో వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,82,469కి చేరింది

ఏపీలో మరోసారి 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మంగళవారం కొత్తగా 10,830 మందికి పాజిటివ్‌గా తేలడంతో వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,82,469కి చేరింది.

గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా 81 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 3,541కి చేరుకుంది. నిన్న 61,838 శాంపిల్స్‌ను పరీక్షించడంతో మొత్తం టెస్టుల సంఖ్య 34,18,690కి చేరింది.

గత 24 గంటల్లో 8,473 మంది కోవిడ్ నుంచి కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 2,86,720కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 92,208 యాక్టివ్ కేసులున్నాయి.

కోవిడ్ కారణంగా తూర్పుగోదావరిలో 11, ప్రకాశం 9, చిత్తూరు 8, కడప 8, అనంతపురం 6, పశ్చిమ గోదావరి 6, కృష్ణ 5, కర్నూలు 5, నెల్లూరు 5, విశాఖపట్నం 5, విజయనగరం 5, గుంటూరు 4, శ్రీకాకుళంలలో నలుగురు చొప్పున మరణించారు.

గడిచిన 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1,528 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అనంతపురం 728, చిత్తూరు 913, గుంటూరు 532, కడప 728, కృష్ణ 299, కర్నూలు 745, నెల్లూరు 1,168, ప్రకాశం 786, శ్రీకాకుళం 618, విశాఖపట్నం 1,156, విజయనగరం 564, పశ్చిమ గోదావరిలలో 1,065 కేసులు వెలుగు చూశాయి. 

 

: 26/08/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 3,79,574 పాజిటివ్ కేసు లకు గాను
*2,83,825 మంది డిశ్చార్జ్ కాగా
*3,541 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 92,208 pic.twitter.com/bloq7WN7ul

— ArogyaAndhra (@ArogyaAndhra)

 

click me!