ఓటమి నుంచి కోలుకోని అయ్యన్నపాత్రుడు: పొలిట్ బ్యూరో మీటింగ్ లో ఏడుపులు

By Nagaraju penumalaFirst Published Aug 9, 2019, 4:34 PM IST
Highlights

ఇకపోతే పేదోడి కడుపు నింపాలని ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ప్రవేశపెడితే వాటిని వైసీపీ మూసివేస్తోందని అది బాధాకరమంటూ కంట తడిపెట్టారు. ఈ కార్యక్రమం వల్ల ప్రతీ పేదవాడు కడుపు నిండా అన్నం తినగలుగుతున్నాడని ఇలాంట నిర్ణయం వల్ల అంతా బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 

అమరావతి: మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు అయ్యన్న. 

సార్వత్రిక ఎన్నికల అనంతరం మాజీ చంద్రబాబు నాయుడు గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అయ్యన్నపాత్రుడు ఓటమిని తలచుకుని పదేపదే విలపించారట. 

గత ఎన్నికల్లో ఓటమి, ఎన్నికల ఫలితాలు, నష్టం చేకూర్చిన అంశాలు, వైసీపీకి కలిసొచ్చిన అంశాలపై పొలిట్ బ్యూరోలో చర్చించారు. ఈ సందర్భంగా అయ్యన్న తెలుగుదేశం పార్టీ ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధిబాటలో పట్టించామని అయితే ప్రజలను ఎందుకు ఆకట్టుకోలేకపోయామో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇకపోతే పేదోడి కడుపు నింపాలని ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ప్రవేశపెడితే వాటిని వైసీపీ మూసివేస్తోందని అది బాధాకరమంటూ కంట తడిపెట్టారు. ఈ కార్యక్రమం వల్ల ప్రతీ పేదవాడు కడుపు నిండా అన్నం తినగలుగుతున్నాడని ఇలాంట నిర్ణయం వల్ల అంతా బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

అలాగే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలు, పోలవరం ప్రాజెక్టు, పీపీఏలు, అమరావతి రాజధాని వంటి అంశాలపై వాడీవేడిగా పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించారు.  

ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసిందని చెప్పుకొచ్చారు. అయితే తాము డబ్బు ఖర్చు చేయలేకపోయామని నేతలు అభిప్రాయపడ్డారు.  ఇదిలా ఉంటే పొలిట్ బ్యూరోని ప్రక్షాళన చేస్తే బాగుంటుందని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు. 

అంతేకాదు గత ఐదేళ్లు చంద్రబాబు పడిన కష్టాన్ని గుర్తుకు తెచ్చారు. ఈ సందర్భంగా సోమిరెడ్డిపై ప్రశంసలు కురిపించారు చంద్రబాబు. సోమిరెడ్డి యువకుడిలా ఉత్సాహంగా ఉన్నారంటూ పొగడ్తలు గుప్పించారు. సోమిరెడ్డిలా ప్రతీ ఒక్కరూ కష్టపడాలని సూచించారు. 

మరోవైపు సామాజిక సమీకరణలో విఫలమయ్యామని అందువల్లే ఓటమికి గురైనట్లు మరికొందరు పొలిట్ బ్యూరో సమావేశంలో స్పష్టం చేశారు. అభివృద్ధి, భవిష్యత్‌పై దృష్టిపెట్టి సామాజిక సమీకరణను విస్మరించామని చెప్పుకొచ్చారు. 

ఇదంతా ఒక ఎత్తైతే ఎన్నికల్లో కొందరు నేతలు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఓటమి పాలయ్యామని మరికొందరు అభిప్రాయపడ్డారు. గెలుస్తాంలే అనే ధీమాతో కొందరు సక్రమంగా పనిచేయలేదని చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. 

ఈ వార్తలు కూడా చదవండి

నేను ఏదైతే చెప్పానో జగన్ అలానే చేస్తున్నాడు: చంద్రబాబు నాయుడు

జగన్ 70 రోజుల పాలనకు రెఫరెండం ఆ 98 మంది బలిదానాలే : కాల్వ శ్రీనివాసులు

జగన్ లా నాడు వైయస్ కూడా చేయలేదు : అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు

 

click me!