చలో ఆత్మకూరు నేపథ్యంలో చింతమనేని ఇంటి వద్ద మహిళా పోలీసులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వారిని లాయర్ శ్రీనివాసబాబు నిర్బందించారని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనివాసబాబును అరెస్ట్ చేసే సమయంలో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
అమరావతి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది శ్రీనివాసబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. చింతమనేని ఇంటి వద్ద మహిళా పోలీసులను నిర్బంధించారన్న కారణంగా శ్రీనివాసబాబుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
చలో ఆత్మకూరు నేపథ్యంలో చింతమనేని ఇంటి వద్ద మహిళా పోలీసులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వారిని లాయర్ శ్రీనివాసబాబు నిర్బందించారని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనివాసబాబును అరెస్ట్ చేసే సమయంలో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
అరెస్ట్ చేసే సమయంలో లాయర్ శ్రీనివాసబాబు తలుపులు మూసేశారు. ఆ సమయంలో పోలీసులు ఇంటి తలుపులను ధ్వంసం చేశారు. శ్రీనివాసబాబు అరెస్ట్ ను నిరసిస్తూ న్యాయవాదుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయినప్పటికీ శ్రీనివాసబాబును పోలీసు వాహనంలో తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఏలూరు కోర్టుకు చింతమనేని ప్రభాకర్: ఈనెల 25 వరకు రిమాండ్
రెచ్చగొట్టారు, నాది తప్పని నిరూపిస్తే... బొత్సకు చింతమనేని సవాల్
అజ్ఞాతం వీడిన చింతమనేని: భార్యను చూసేందుకు వెళ్తుండగా అరెస్ట్
నేడు పోలీసుల ఎదుట లొంగిపోనున్న చింతమనేని ప్రభాకర్