జగన్ ప్లాన్: ఒకటి నుండి 8వరకు ఇంగ్లీష్‌లోనే విద్యా బోధన

Published : Sep 12, 2019, 12:51 PM IST
జగన్ ప్లాన్:  ఒకటి నుండి 8వరకు ఇంగ్లీష్‌లోనే విద్యా బోధన

సారాంశం

వచ్చే విద్యాసంవత్సరం నుండి ఇంగ్లీస్ మీడియంలోనే ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన జరిపించాలని జగన్ సర్కార్ ప్లాన్ చేస్తుంది.


హైదరాబాద్:వచ్చే విద్యా సంవత్సరం నుండి ఒకటవ తరగతి నుండి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యాభ్యాసాన్ని తప్పనిసరి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.ఈ మేరకు టీచర్లకు కూడ శిక్షణను ఇవ్వనుంది.

ఇంగ్లీష్ మీడియంలో విద్యార్ధులకు బోదన కోసం 70వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్టుగా సీఎం జగన్ ప్రకటించారు.విద్యాశాఖ సమీక్ష సమావేశంలో ఈ మేరకు ఈ విషయాన్ని సీఎం జగన్ స్పష్టం చేవారు. డైట్ కేంద్రాల ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు.

ప్రతి ఏటా జనవరి మాసంలో ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు, టీచర్ల నిష్పత్తి సమానంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.పర్యావరణం, వాతావరణ మార్పులు, రోడ్డు భద్రతపై పాఠ్యాంశాల్లో చేర్చనున్నట్టు సీఎం ప్రకటించారు.

ప్రతి మండలానికి ఓ ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతి ఉన్నత పాఠవాలనుయ  జూనియర్ కాలేజీగా అప్ గ్రేడ్ చేయాలని సీఎం చెప్పారు. ఈ మేరకు అధికారులు అవసరమైన కసరత్తు చేయాలని ఆయన ఆదేశించారు.ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మేరకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.

రాష్ట్రంలోని 44,512 పునరుద్దరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. మొదటి విడతలో 15,410 స్కూళ్లను పునరుద్దరించాలని సర్కార్ ప్లాన్ చేసింది.ప్రతి విడతలో పంచాయితీరాజ్, మున్సిపల్, గిరిజన, బీసీ, సోషల్ వేల్పేర్ పాఠశాలలను తప్పనిసరిగా పునరుద్దరించనున్నారు. 

వచ్చే ఏడాది మార్చి 14 నాటికి స్కూళ్ల పునరుద్దరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేసింది.నాణ్యమైన విద్యను పిల్లలకు అందించే విషయంలో తల్లిదండ్రులను కూడ భాగస్వామ్యులను చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం