700 మంది రైతులు చనిపోయారు.. అప్పుడు పరామర్శించలేదే : పవన్‌‌పై మాజీ మంత్రి శంకర్ నారాయణ ఫైర్

Siva Kodati |  
Published : Apr 13, 2022, 06:35 PM ISTUpdated : Apr 13, 2022, 06:36 PM IST
700 మంది రైతులు చనిపోయారు.. అప్పుడు పరామర్శించలేదే :  పవన్‌‌పై మాజీ మంత్రి శంకర్ నారాయణ ఫైర్

సారాంశం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన కౌలు రైతుల భరోసా యాత్రపై మండిపడ్డారు మాజీ మంత్రి శంకర్ నారాయణ. అసలు వ్యవసాయం గురించి పవన్ కల్యాణ్‌కు ఏం తెలుసునని ఆయన ప్రశ్నించారు

వ్యవసాయం గురించి పవన్ కల్యాణ్‌కు ఏం తెలుసునని ప్రశ్నించారు మాజీ మంత్రి శంకర్ నారాయణ (shankar narayana) . బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ పరామర్శించిన రైతులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సాయం ప్రకటించిందన్నారు. పరిహారం పెంచిన విషయం కూడా పవన్ కల్యాణ్‌కు తెలియదని శంకర్ నారాయణ అన్నారు. టీడీపీ హయాంలో 700 మందికి పైగా రైతులు చనిపోతే పరిహారం ఎంతమందికి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. అప్పుడు రైతులను ఎందుకు పరామర్శించలేదని పవన్ కల్యాణ్‌ని శంకర్ నారాయణ నిలదీశారు. 

మరోవైపు.. తాను Chandrababu naidu దత్తపుత్రుడైతే  మిమ్మల్ని CBI దత్త పుత్రుడు అనాల్సి వస్తుందన్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. తనను చంద్రబాబు దత్త పుత్రుడు అంటున్నారని YCP నేతల విమర్శలపై పవన్ కళ్యాణ్ రియాక్టయ్యారు.  గత వారంలో జరిగిన రెండు సభల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం నాడు అనంతపురం జిల్లాలో కౌలు రైతులకు ఆర్ధిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆఈయన మీడియాతో మాట్లాడారు. తాను విధానపరమైన అంశాలపై వ్యాఖ్యానిస్తానని జనసేన చీఫ్ Pawan Kalyan చెప్పారు. కానీ, తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ మాత్రం ఊరుకోబోనని ఆయన తేల్చి చెప్పారు. తనకు నీతులు చెప్పే స్థాయి వైసీపీ నేతలకు లేదన్నారు. 

జనసేన టీడీపీకి బీ టీం అయితే వైసీపీని చర్లపల్లి జైలు షటిల్ టీం అంటామన్నారు. ఆర్ధిక నేరాలు చేసి జైలుకు వెళ్లి వచ్చారని ఆయన జగన్ పై మండిపడ్డారు. దేశం కోసం జైలుకు వెళ్లారా అని ప్రశ్నించారు.16 నెలలు జైల్లో కూర్చొని వచ్చి మీరా మాకు నీతులు చెప్పేది అంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. పరామర్శకు వస్తున్నానని తెలియగానే ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందన్నారు. ఆత్మహత్యలు చేసుకొన్న రైతు కుటుంబాలకు రూ. 7 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక మాదిరిగా తయారౌతుందని చంద్రబాబు  ఇటీవల విమర్శలు చేశారు. ఈ విమర్శలకు ఊతమిచ్చేలా ఎల్లో మీడియా ప్రచారం చేస్తుందని జగన్ విమర్శలు చేశారు. ఎల్లో మీడియాతో పాటు దత్త పుత్రుడు కూడా ఇదే పల్లవిని అందుకున్నారని జగన్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే ఓర్వలేక  దుష్ఫ్రచారం చేస్తున్నారని మండి పడ్డారు.  చంద్రబాబుతో పాటు దత్తపుత్రుడు అంటూ జగన్ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. జగన్ తో పాటు పలువురు వైసీపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ విమర్శలు చేస్తున్నారు.  ఈ విమర్శలపై పవన్ కళ్యాణ్ ఇవాళ స్పందించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం