నా వెంట్రుక పీకలేరన్న జగన్.. ఆ మాటలు వైసీపీ ఎమ్మెల్యేల‌ గురించే: జేసీ సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Apr 13, 2022, 05:51 PM ISTUpdated : Apr 13, 2022, 06:28 PM IST
నా వెంట్రుక పీకలేరన్న జగన్.. ఆ మాటలు వైసీపీ ఎమ్మెల్యేల‌ గురించే: జేసీ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

తన వెంట్రుక కూడా పీకలేరంటూ ప్రతిపక్షాలపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైరయ్యారు. త‌న‌కు న‌చ్చిన వారికే కేబినెట్‌లో అవ‌కాశం ఇస్తాన‌న్న మెసేజ్‌ను ఎమ్మెల్యేల్లోకి పంపే దిశ‌గానే ఈ వ్యాఖ్య‌లు చేశార‌ని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు

నంద్యాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా త‌న వెంట్రుక కూడా పీక‌లేరంటూ ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఇవి ఎవ‌రిని ఉద్దేశించి చేసిన‌వ‌న్న దానిపై టీడీపీ సీనియ‌ర్ నేత‌, అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి మునిసిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి (jc prabhakar reddy) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ నోట నుంచి వ‌చ్చిన ఆ వ్యాఖ్య‌లు వైసీపీ ఎమ్మెల్యేల‌ను ఉద్దేశించి చేసిన‌వేనంటూ జేసీ వ్యాఖ్యానించారు. 

బుధ‌వారం అనంత‌పురంలో మీడియాతో మాట్లాడిన జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ... విద్యా దీవెన పేరిట విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాలుపంచుకున్న స‌మావేశంలో జ‌గ‌న్ ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌న్నారు. ఆయన నోట నుంచి ఈ వ్యాఖ్య‌లు వ‌చ్చినంత‌నే జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌నో, మ‌రొక‌రినో ఉద్దేశించి అన్నార‌ని అంతా అనుకున్నార‌ని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే త‌న‌కు న‌చ్చిన వారికే కేబినెట్‌లో అవ‌కాశం ఇస్తాన‌న్న మెసేజ్‌ను ఎమ్మెల్యేల్లోకి పంపే దిశ‌గానే ఈ వ్యాఖ్య‌లు చేశార‌ని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా తాను చెప్పిందే వేద వాక్కు అని వైసీపీ ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ చెప్ప‌క‌నే చెప్పార‌ని ప్రభాకర్ అన్నారు.

ఇకపోతే.. Jagananna Vasathi Deevena  కార్యక్రమం కింద  రెండో విడత 10,68,150 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 1,024 కోట్లు ఏపీ సీఎం YS Jagan  శుక్రవారం నాడు జమ చేశారు. ఈ సందర్భంగా Nandyalలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. తమ ప్రభుత్వం విద్యార్ధులకు చిక్కి అందిస్తుందన్నారు. అయితే ఈ చిక్కి విద్యార్ధుల చేతికి అంటకూడదనే ఉద్దేశ్యంతోనే తమ ప్రభుత్వం ఈ చిక్కికి  కవర్ చుట్టి అందిస్తున్నామన్నారు. ఈ చిక్కీపై జగన్ ఫోటో ఉందని చంద్రబాబుతో పాటు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ లు, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.  

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్ధుల కోసం చంద్రబాబు సర్కార్ (chandrababu naidu) కంటే గతంలో కంటే ఎంత ఎక్కువ మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నామో మాత్రం చెప్పడం లేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలతో  విపక్షాలకు కడుపుమంట, అసూయ కలుగుతుందన్నారు. అసూయకు మందే లేదన్నారు.  అసూయ ఎక్కువైతే బీపీ, షుగర్ తో పాటు గుండెపోటు వస్దుందని జగన్  చెప్పారు. అది అలానే కొనసాగితే ఏదో ఒక రోజు టికెట్ తీసుకుంటారని జగన్ శాపనార్ధాలు పెట్టారు. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు ఉన్నంత కాలం వాళ్లు నా వెంట్రుక కూడా పీకలేరని ఏపీ సీఎం వైఎస్ జగన్ విపక్షాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కేసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడితే వాటికి సహకరించకపోగా రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లేందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ (pawan kalyan), ఎల్లో మీడియా ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. రోజుకో కట్టు కథను ప్రచారం చేస్తున్నారన్నారు. పార్లమెంట్ వేదికగా కూడా కట్టుకథలను ప్రచారం చేసి రాష్ట్ర పరువును తీశారని జగన్ టీడీపీపై మండిపడ్డారు. బెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా విపక్షాలున్నాయన్నారు. కానీ రాష్ట్రం పరువును పార్లమెంట్ లో తీసే ప్రయత్నాలు  ఆయా రాష్ట్రాల్లో విపక్షాలు చేయలేదన్నారు. ఏపీ రాష్ట్రంలో దౌర్భాగ్యపు విపక్షం కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందని జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.చంద్రబాబు నాయుడు సర్కార్ ఎగ్గొట్టిన పీజు రీ ఎంబర్స్ మెంట్  బకాయిలను కూడా తమ ప్రభుత్వమే చెల్లించిందని సీఎం జగన్ గుర్తు చేశారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Birthday: సీఎం చంద్రబాబుకి నారా భువనేశ్వరి పుట్టినరోజు కానుక | Asianet Telugu
Goa Governor Ashok Gajapathi Raju Performs Sacred Rituals in Visakhapatnam | Asianet News Telugu