తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్ జగన్ తోనే ఉంటానని ఏపీ మాజీ హోంశాఖ మంత్రి సుచరిత చెప్పారు. ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్ తో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
అమరావతి:తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్ జగన్ వెంటే ఉంటానని మాజీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు.బుధవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ తో మాజీ మంత్రి హోం మంత్రి మేకతోటి సుచరిత భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత Mekathoti Sucharithaమీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం పని చేయాలని సీఎం YS Jagan చెప్పారన్నారు. తనను సీఎం జగన్ ఎప్పుడూ కూడా చెల్లి అని పిలుస్తుంటారని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.వైఎస్ జగన్ ఆశీస్సులతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టుగా ఆమె గుర్తు చేసుకొన్నారు.జడ్పీటీసీ నుండి Home ministerగా తాను ఎదగడానికి వైఎస్ జగన్ అవకాశం ఇచ్చారన్నారు.
అనారోగ్య సమస్యలతో తాను కొన్ని రోజులుగా ఇంటి నుండి బయటకు రాలేకపోయాయని ఆమె చెప్పారు.కేబినెట్ పునర్వవ్యవస్థీకరణలో జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని ఆమె చెప్పారు.
undefined
తన అనారోగ్య కారణాల వల్ల కానీ, వ్యక్తిగత కారణాలతో కూడా తాను కొనసాగలేమోననే థ్యాంక్స్ గివింగ్ లెటర్ ను రాస్తే రాజీనామా చేశానని కూడా మీడియా కథనాలు వచ్చాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సామాజిక సమీకరణాల నేపథ్యంలో కొందరిని మంత్రివర్గంలో కొనసాగించారు, కొందరిని తప్పించారని సుచరిత చెప్పారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్ తోనే కొనసాగుతానని చెప్పారు. రాజకీయాల నుండి తప్పుకొన్నా కూడా వైసీపీ కార్యకర్తగానే కొనసాగుతానని ఆమె చెప్పారు.
మాజీ మంత్రి Mopidevi Venkata Ramana తన ఇంటికి వచ్చిన సమయంలో తన కూతురు రాజీనామా చేసిందనే విషయం ప్రకటించడంపై ఆమె వివరణ ఇచ్చారు. రాజకీయాలంటే తెలియని తన కూతురు చేసిన వ్యాఖ్యల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్తీకరించారు.11 మంది పాత మంత్రులకు మరోసారి చోటు కల్పించారు. 14 మంది కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు. తొలుత అంబటి రాంబాబు ప్రమాణం చేశారు. చివరకు విడుదల రజ.ని మంత్రిగా ప్రమాణం చేశారు. 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్‌లో చోటు దక్కింది. సామాజిక సమీకరణాల పరంగా చూస్తే బీసీ-10, కాపు-4, రెడ్డి-4, ఎస్సీ-5, ఎస్టీ-1, మైనార్టీ-1కి అవకాశం కల్పించారు.అయితే మంత్రివర్గంలో చోటు దక్కని కొందరు వైసీపీ ప్రజా ప్రతినిధులు అసమ్మతి గళం విన్పించారు.. రాజీనామాలు చేస్తామని కూడా ప్రకటించారు. మాజీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత రాజీనామా చేస్తానని ప్రకటించారు. మంత్రి పదవి దక్కని అసంతృప్తులను వైసీపి నాయకత్వం చల్లబరిచింది.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జరిపిన చర్చలు ఫలించాయి. .సీఎం జగన్ తో బాలినేని శ్రీనివాస్ రెడ్డి సోమవారం నాడు భేటీ అయ్యారు. పార్టీ పదవిని సీఎం అప్పగిస్తారని చెప్పారన్నారు. ఏ బాధ్యత ఇచ్చినా కూడా తాను సమర్ధవంతంగా నిరవహిస్తానని చెప్పారు. ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేకతోటి సుచరితలతో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సమావేశమయ్యారు. ఇద్దరితో చర్చించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం నాడు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో భేటీ అయ్యారు. ఆ తర్వాత సీఎంతో కూడా ఆయన భేటీ అయ్యారు. పార్టీ బాధ్యతలను తాను నిర్వహిస్తానని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. సామినేని ఉదయభాను కూడా నిన్ననే సీఎంతో భేటీ అయ్యారు. అయితే సీఎం చుట్టూ ఉన్న కోటరీ గురించి కూడా ఉదయభాను సీఎం వద్ద ఫిర్యాదు చేశారు. ఇవాళ మాజీ హోం మంత్రి సుచరిత సీఎంతో భేటీ అయ్యారు.