అధికారంలోకి వస్తే రివేంజే.. ఎవ్వరినీ వదిలేది లేదు : ప్రత్తిపాటి సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Feb 2, 2020, 9:11 PM IST
Highlights

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రివేంజ్ తీసుకోవడమే తన లక్ష్యమన్నారు. మొదటి ప్రాధాన్యత రివేంజ్.. రెండోది అభివృద్ధి అన్నారు

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రివేంజ్ తీసుకోవడమే తన లక్ష్యమన్నారు. మొదటి ప్రాధాన్యత రివేంజ్.. రెండోది అభివృద్ధి అన్నారు.

ఇప్పుడు నాలుగు కేసులు పెడితే.. తర్వాత 10 కేసులు పెడతామని ప్రత్తిపాటి వ్యాఖ్యానించారు. మన దమ్మేంటో ఈసారి చూపిద్దామని.. అధికారంలోకి వస్తే ఎంతటి అధికారినైనా వదిలేది లేదని పుల్లారావు స్పష్టం చేశారు. 

Also Read:ఆధారాలు దొరక్కపోతే.. తప్పుడు కేసులు పెడతారా: వైసీపీపై ప్రత్తిపాటి ఫైర్

కొద్దిరోజుల క్రితం టీడీపీ నేతలపై వైసీపీ  చేసిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలపై  ఏమీ చేయలేక సీఐడీతో కేసు పెట్టారని  ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తోందని ప్రత్తిపాటి మండిపడ్డారు. తప్పుడు కేసులపై న్యాయ పోరాటం చేస్తామని, వైసీపీ దళితుల్ని అడ్డుపెట్టుకుని ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు.

నరసింహరావు అనే వ్యక్తికి, ఎస్సీ రైతుకు చెందిన భూమిని మాజీ మంత్రి నారాయణ, తాను బెదిరించి ఇప్పించినట్లుగా తప్పుడు కేసులు పెట్టారని పుల్లారావు ధ్వజమెత్తారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని రాజకీయ దురుద్దేశంతోనే తనపై, నారాయణపై కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు.

విపక్ష నాయకులపై తప్పుడు కేసులతో వేధించాలని అనుకుంటున్నారని, ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు విని అక్రమ కేసులు పెట్టే అధికారులను కోర్టుకు లాగుతామని ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు.

Also Read:ఆ ఘనత జగన్ దే... తక్కువ కాలంలోనే చరిత్ర సృష్టించారు: మాజీ మంత్రి ప్రత్తిపాటి సెటైర్లు

తాను బినామీల పేర్లతో రాజధానిలో భూములు కొన్నట్లు వైసీపీ నేతలు ఆరోపించారని వాటిని తేల్చాలని ఆయన సవాల్ విసిరారు. తప్పుడు కేసులకు భయపడేదిలేదని స్పష్టం చేశారు.  

ఎక్కడైనా చట్టాన్ని ఉల్లంఘించి ఉంటే చర్యలు తీసుకోమని ఆరు నెలలుగా ప్రభుత్వాన్ని  కోరుతున్నామని, కానీ ఎలాంటి ఆధారాలు దొరకపోవటంతో తప్పుడు కేసులు పెడుతున్నారని పుల్లారావు దుయ్యబట్టారు. 

click me!