మాజీమంత్రి మాణిక్యాలరావు డిశ్చార్జ్: దీక్ష భగ్నంపై ఆగ్రహం

By Nagaraju TFirst Published Jan 24, 2019, 6:25 AM IST
Highlights

మెడికల్ రిపోర్టులు తప్పుగా చూపించి తన దీక్ష భగ్నం చేశారని మాణిక్యాలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దీక్షను భగ్నం చేసినా జిల్లాకు ఇచ్చిన హామీలను అమలు చేసేవరకు పోరాడతానని ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. 

తాడేపల్లిగూడెం: 2014 ఎన్నికల సమయంలో పశ్చిమగోదావరి జిల్లాకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన 56 హామీలను అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి పాలైన మాజీమంత్రి మాణిక్యాలరావు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 

తాడేపల్లిగూడెంలోని తన క్యాంపు కార్యాలయం వద్ద మాణిక్యాలరావు ఈనెల 21న నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. అయితే మాణిక్యాలరావు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రెండు రోజులకే దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆయన్ను తాడేపల్లి గూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

ఒకరోజు ఆస్పత్రిలో వైద్య సేవలందించిన వైద్యులు సాయంత్రం ఆయన్ను ఏరియా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. డిశ్చార్జ్ అయిన తర్వాత మాజీమంత్రి మాణిక్యాలరావు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు దౌర్జన్యంగా తన దీక్షను భగ్నం చేశారని ఆరోపించారు. 

మెడికల్ రిపోర్టులు తప్పుగా చూపించి తన దీక్ష భగ్నం చేశారని మాణిక్యాలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దీక్షను భగ్నం చేసినా జిల్లాకు ఇచ్చిన హామీలను అమలు చేసేవరకు పోరాడతానని ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. 

ఇకపోతే జిల్లాకు ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ గత ఏడాది డిసెంబర్ 25న ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకి రాజీనామా అల్టిమేటం జారీ చేశారు మాజీమంత్రి మాణిక్యాలరావు. 

ఈ వార్తలు కూడా చదవండి

మాణిక్యాల రావు దీక్ష భగ్నం: ఆస్పత్రికి తరలింపు

చంద్రబాబు హామీలు హుష్ కాకి: దీక్షకు దిగిన మాణిక్యాలరావు

దీక్షకు దిగుతున్నా, చంద్రబాబు కళ్లు తెరవాలి : మాజీమంత్రి మాణిక్యాలరావు

నేను త్యాగం చేస్తేనే ఎమ్మెల్యే అయ్యావ్ : ఈలి నాని

చిల్లర రాజకీయాలు మానుకో: మాణిక్యాల రావుకు చంద్రబాబు వార్నింగ్

మాజీ మంత్రి మాణిక్యాల రావు సంచలన నిర్ణయం

మాజీ మంత్రి మాణిక్యాలరావుకు అస్వస్థత...ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత

రాబోయే ఎన్నికల్లో టీడీపీ భవితవ్యంపై మాజీమంత్రి జోస్యం

 

click me!