జగన్ పై దాడి కేసు: ఎన్ఐఏ చార్జిషీట్ లో కీలక అంశాలు

By Nagaraju TFirst Published Jan 24, 2019, 6:18 AM IST
Highlights

అయితే కుట్ర కోణం లేదా నిందితుడికి ప్రోత్సాహం ఉందా అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోందని మాత్రం ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. సీఆర్‌పీసీ 173(8) కింద దర్యాప్తు చేస్తున్నామని ఎన్‌ఐఏ చార్జిషీట్ లో పేర్కొంది. ఒకవేళ కుట్ర  కోణాలేమైనా ఉంటే భవిష్యత్‌లో మళ్లీ పూర్తిస్థాయి ఛార్జిషీట్‌ వేస్తామని కూడా ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. 

అమరావతి: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ దూకుడు పెంచింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి ఎన్ఐఏ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినప్పటి నుంచి ఎన్ఐఏ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయనిరాకరణ ఎదుర్కోంటుంది. 

ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు సంస్థ కానీ, పోలీసులు కానీ సహకరించడం లేదు. అయినా ఎన్ఐఏ అధికారులు విచారణను ఏమాత్రం ఆపడం లేదు. అంతేకాదు జగన్ పై దాడి కేసుకు సంబంధించి ఎన్ఐఏ విచారణను రద్దు చెయ్యాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. 

ఆ అంశంపై ఈనెల 30న విచారణకు రానుంది. ఇంతలోనే ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న జె.శ్రీనివాసరావును ఏవన్ గా చార్జిషీట్ లో పొందు పరచింది. అలాగే జగన్ పై దాడి జరిగిన తీరును ఎన్ఐఏ క్షుణ్ణంగా వివరించినట్లు తెలుస్తోంది. 

అయితే కుట్ర కోణం లేదా నిందితుడికి ప్రోత్సాహం ఉందా అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోందని మాత్రం ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. సీఆర్‌పీసీ 173(8) కింద దర్యాప్తు చేస్తున్నామని ఎన్‌ఐఏ చార్జిషీట్ లో పేర్కొంది. ఒకవేళ కుట్ర  కోణాలేమైనా ఉంటే భవిష్యత్‌లో మళ్లీ పూర్తిస్థాయి ఛార్జిషీట్‌ వేస్తామని కూడా ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. 

1982 కేంద్ర పౌరవిమానయాన చట్టం సెక్షన్‌ 9 కింద కేసు దర్యాప్తు చేయాలని కేంద్రం ఆదేశించిందని ఎన్‌ఐఏ చెప్పుకొచ్చింది. మరోవైపు ప్రిలిమినరీ చార్జిషీట్‌లో కుట్ర కోణాన్ని ఎన్‌ఐఏ పేర్కొనలేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. 

ఇదిలా ఉంటే ఈ కేసులో విచారణ అధికారిగా ఏఎస్పీ మహమ్మద్ సాజిద్‌ఖాన్‌ను ఎన్ఐఏ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చెయ్యడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. మెుత్తానికి జగన్ పై దాడి కేసును ఎన్ఐఏ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ పై దాడి కేసు: ఎన్ఐఏ దూకుడు, చార్జిషీట్ దాఖలు

జగన్ పై దాడి కేసు: చంద్రబాబు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

జగన్ పై దాడి కేసు: ఫ్లెక్సీ, లేఖపై ఎన్ఐఏ అధికారుల ఆరా

జగన్ పై దాడి కేసు: ఎన్ఐఏ విచారణకు హాజరైన వైసీపీ నేతలు వీరే

జగన్ పై దాడి కేసు: హైకోర్టులో చంద్రబాబు ప్రభుత్వానికి చుక్కెదురు

బెజవాడలో శ్రీనివాసరావుకు ముప్పు: రాజమండ్రి జైలుకు తరలింపు

ప్రజలతో మాట్లాడనిస్తే అంతా చెప్తా.. జగన్ పై దాడి కేసు నిందితుడు

జగన్‌పై దాడి కేసు: ఎన్ఐఏ విచారణను నిలిపివేయాలంటూ ఏపీ సర్కార్ పిటిషన్

click me!
Last Updated Jan 24, 2019, 6:18 AM IST
click me!