మళ్లీ ఆ పరిస్ధితి తేవొద్దు : అమరావతి రైతుల పాదయాత్రపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Oct 5, 2022, 4:55 PM IST
Highlights

అమరావతి రైతుల పాదయాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని. రాష్ట్ర సంపద ఒకే చోట పెడితే ప్రాంతీయ విద్వేషాలు వస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 
 

అమరావతి రైతుల పాదయాత్రపై స్పందించారు మాజీ మంత్రి కొడాలి నాని. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి ఉద్యమాన్ని ప్రజలు హర్షించరన్నారు. ఎవరికీ అన్యాయం చేయకూడదనే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని కొడాలి నాని అన్నారు. రాష్ట్ర సంపద ఒకే చోట పెడితే ప్రాంతీయ విద్వేషాలు వస్తాయని .. ప్రజల శ్రమ అమరావతికే పెడితే, హైదరాబాద్ పరిస్ధితే వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌ను కోల్పోయిన నష్టపోయామని కొడాలి నాని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇకపోతే.. మహా పాదయాత్రను ఉద్దేశిస్తూ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతుల పాదయాత్ర ఒక్క అడుగు ముందుకు వేయకుండా అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దుష్టశక్తులు, దుర్మార్గులను అడ్డుకోవాల్సిన అవసరం వుందని బొత్స పేర్కొన్నారు. బీజేపీ నేతలు రాజధాని విశాఖకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇస్తున్నారని మంత్రి మండిపడ్డారు. బీజేపీ నేతలు ద్వంద వైఖరి అవలంభిస్తున్నారని... వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానమని బొత్స స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో వికేంద్రీకరణకు సంబంధించిన అంశాలను పెట్టామని.. బొత్స సత్యనారాయణ వెల్లడించారు. 29 గ్రామాలు, ఒక ప్రాంతం, వర్గం కోసం ప్రభుత్వం ఆలోచించదని మంత్రి పేర్కొన్నారు. శివరామకృష్ణన్ కమిటీకి గత ప్రభుత్వం కో ఆపరేట్ చేయలేదని..ఆ కమిటీ గత ప్రభుత్వం నిర్ణయం సరైనది కాదని చెప్పిందని బొత్స గుర్తుచేశారు. రైతుల ముసుగులో టీడీపీ చేస్తున్న పాదయాత్రకు బుద్ధి చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు. 

ALso REad:‘‘రైతుల ముసుగులో ఫేక్ యాత్రికులు’’... అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా పోస్టర్లు, కలకలం
 
కాగా.. ఈ యాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజవకర్గంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఫ్లెక్సీల వార్ నెలకొంది. కొందరు ఈ పాదయాత్రకు స్వాగతం పలుకుతూ బ్యానర్లు ఏర్పాటు చేయగా.. మరికొందరు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కట్టారు. ‘‘గో బ్యాక్ ఫేక్ యాత్రికులు’’ అంటూ అందులో రాత లున్నాయి. రైతుల ముసుగులోని ఫేక్ యాత్రికులు గో బ్యాక్ అంటూ రెచ్చగొట్టే నినాదాలను రాశారు. మరోవైపు పాదయాత్రను వ్యతిరేకిస్తూ వెలిసిన ఫెక్సీలపై రాజధాని రైతులు, టీడీపీ, జనసేన నేతలు మండిపడుతున్నారు
 

click me!