పకోడీ గాడు .. అలాంటోళ్లతో జాగ్రత్త, లేదంటే బీజేపీకి కర్ణాటక గతే : సునీల్ దియోధర్‌కు కొడాలి నాని కౌంటర్

Siva Kodati |  
Published : May 17, 2023, 08:53 PM IST
పకోడీ గాడు .. అలాంటోళ్లతో జాగ్రత్త, లేదంటే బీజేపీకి కర్ణాటక గతే : సునీల్ దియోధర్‌కు కొడాలి నాని కౌంటర్

సారాంశం

తనపై ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సునీల్ దియోధర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. దేశవ్యాప్తంగా వున్న సునీల్ దియోధర్ లాంటి బీజేపీ నేతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను ఆయన కోరారు

తనపై ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సునీల్ దియోధర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. సునీల్ ఒక పకోడి అన్న ఆయన.. అతనిలాంటి పకోడీల వల్లే కర్ణాటకలో బీజేపీకి ఆ పరిస్ధితి వచ్చిందన్నారు. సునీల్ లాంటి వ్యక్తులు ఏపీకి వచ్చి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వున్న సునీల్ దియోధర్ లాంటి బీజేపీ నేతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను ఆయన కోరారు. 

ఇక ఆర్ 5 జోన్‌పై సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పుపై కొడాలి నాని స్పందిస్తూ.. పేదల పక్షాన న్యాయం ఉంటుందనడానికి సుప్రీం తీర్పే ఉదాహరణ అన్నారు. పేదలు అమరావతిలోకి రాకుండా మూడేళ్లుగా అడ్డుకుంటున్నారని నాని ఆరోపించారు. వేలాది మంది పేదలకు న్యాయం చేసిన కోర్టులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. స్వర్ణ నగరంగా ఉండాలన్న పిడి వాదన నుండి అమరావతి బయటపడిందని నాని వ్యాఖ్యానించారు. లోకేష్‌ను ఓడించడానికే పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని, టిడిపి నేతలు ఎలా అనగలుగుతారని ఆయన ప్రశ్నించారు. పేదలు ఉన్న చోట లోకేష్ ఓడిపోతాడని టిడిపి నేతలకు నమ్మకం కలిగిందని కొడాలి నాని చురకలంటించారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా పేదల పార్టీనే అని ఆయన స్పష్టం చేశారు. 

ALso Read: బూతులతోనే ఫేమస్.. సంక్రాంతిని క్యాసినోగా మార్చాడు , అసెంబ్లీకి మళ్లీ పంపొద్దు : కొడాలి నానిపై సునీల్ దియోధర్

అంతకుముందు కొడాలి నానిపై మండిపడ్డారు ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్. బుధవారం గుడివాడ నియోజకవర్గ సమస్యలపై బిజెపి చార్జిషీట్ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గాడిదలా, కుక్కలా బూతులు మాట్లాడుతూ ఫేమస్ అయ్యారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే మాటలతో ఏపీ పరువు పోతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు వారికి విశిష్టత కలిగిన సంక్రాంతి పండుగను నాని క్యాసినో, క్యాబిరే డ్యాన్స్ లుగా మార్చేశారని సునీల్ దుయ్యబట్టారు. గుడివాడ యువతను సర్వనాశనం చేస్తున్న కొడాలి నాని.... జీవితంలో అసెంబ్లీ గడప తొక్కకుండా ప్రజలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకొస్తే కొడాలి నాని లాంటి ఎమ్మెల్యేలను జైలుకు పంపుతామని సునీల్ దియోధర్ స్పష్టం చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్