ఏవీ సుబ్బారెడ్డిపై దాడి .. భూమా అఖిలప్రియ, ఆమె భర్తకు 14 రోజుల రిమాండ్

Siva Kodati |  
Published : May 17, 2023, 06:53 PM ISTUpdated : May 17, 2023, 06:54 PM IST
ఏవీ సుబ్బారెడ్డిపై దాడి .. భూమా అఖిలప్రియ, ఆమె భర్తకు 14 రోజుల రిమాండ్

సారాంశం

టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసిన ఘటనలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్‌కు 14 రోజుల రిమాండ్ విధించి కోర్ట్

టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసిన ఘటనలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్‌కు 14 రోజుల రిమాండ్ విధించి కోర్ట్. వీరిద్దరిని కర్నూలు సబ్ జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించింది. 

ఇదిలా ఉంటే.. నంద్యాల జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర సందర్భంగా కొత్తపల్లిలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో సుబ్బారెడ్డి చొక్కా చిరిగిపోయింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. సుబ్బారెడ్డి  కారులో ఎక్కించి అక్కడి  నుంచి ఆస్పత్రికి తరలించారు. 

ఏవీ సుబ్బారెడ్డిపై దాడి జరిగిన ఘటనలో అఖిలప్రియతోపాటు ఆమె అనుచరులపై హత్యయత్నం కేసులు నమోదుయ్యాయి. ఈ క్రమంలోనే అఖిలప్రియ పీఏ మోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఆనంతరం బుధవారం ఉదయాన్నే అఖిలప్రియ ఇంటికి వెళ్లిన నంద్యాల పోలీసులు.. ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం ఆళ్లగడ్డ నుంచి నంద్యాలకు తరలించారు. మరోవైపు నంద్యాల్లో ఏవీ సుబ్బారెడ్డి ఇంటి దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ALso Read: అఖిలప్రియకు టికెట్ ఇస్తే ఓడిస్తాం.. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డ జస్వంతి రెడ్డి (వీడియో)..

మరోవైపు.. అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి కూతురు జస్వంతి రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై ఫేస్‌బుక్ లైవ్ ద్వారా స్పందించిన జస్వంతి రెడ్డి.. అఖిలప్రియను దున్నపోతు, బజారు మనిషి అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తాము పార్టీ సిద్దాంతాలను నమ్ముకుని పనిచేస్తున్నామని.. అందుకే ఈ ఘటన గురించి ఇప్పటివరకు ఎలాంటి  ప్రెస్ మీట్ పెట్టలేదని చెప్పారు. లోకే ష్ పాదయాత్ర డిస్టర్బ్ అవుతుందనే తాము మాట్లాడలేదని  తెలిపారు. 

తండ్రి లాంటి వ్యక్తి మీద  అఖిలప్రియ అసత్య ఆరోపణలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలప్రియ హత్యయత్నం చేశారని అంటుందని.. ఆమె కొంచెం అన్న బుద్ది ఉండి మాట్లాడుతుందా అని  ప్రశ్నించారు. అఖిలప్రియ చేసే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు ఉండవని అన్నారు. యువగళం పాదయాత్ర లైవ్‌ వీడియోను గనక చూస్తే.. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుస్తుందని అన్నారు. అఖిలప్రియ ఆరోపిస్తున్నట్టుగా అక్కడ ఏం జరగలేదన్నారు. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాలలో ఎక్కడి నుంచి అయినా  పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నామని  చెప్పారు. అఖిలప్రియకు టికెట్ ఇస్తే మాత్రం ఒడించి తీరుతామని తెలిపారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్