వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ కాదు.. వైఎస్‌ఆర్ దగా అని పెట్టండి: వైసీపీ సర్కార్‌పై ఉమా ఫైర్

By Siva KodatiFirst Published Jul 12, 2020, 6:21 PM IST
Highlights

వై ఎస్ ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పధకం కాదు  వై ఎస్ ఆర్ రైతుదగా పధకంగా పేరు మార్చాలని ఎద్దేవా చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా. 

వై ఎస్ ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పధకం కాదు  వై ఎస్ ఆర్ రైతుదగా పధకంగా పేరు మార్చాలని ఎద్దేవా చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా. ఆదివారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికలకు ముందు అందరికీ సున్నా వడ్డీ ఏడాది తర్వాత జీవో 4530 తెచ్చి రైతులను ముంచారని మండిపడ్డారు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కొనసాగిన వడ్డీలేని పంటరుణాలు, పావలా వడ్డీ పథకాలు పేరు మార్చి ఏదో తమ ప్రభుత్వం చేపట్టినట్లుగా గొప్పలు చెబుతున్నారని ఉమా దుయ్యబట్టారు.

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రైతు వడ్డీ చెల్లించే అవసరం లేకుండా రైతు తరపున ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించేదని దేవినేని  గుర్తుచేశారు. కానీ ప్రస్తుత పథకంలో రైతు అసలు వడ్డీ చెల్లిస్తే ప్రభుత్వం రైతుల ఖాతాలో తర్వాత జమ చేస్తుందట అంటూ ఉమా సెటైర్లు వేశారు.

Also Read:తప్పు సరిదిద్దుకోవాలి.. తప్పుడు కేసులు కాదు: జగన్‌పై నిమ్మకాయల మండిపాటు

ప్రస్తుత పధకంలో లక్ష రూపాయల లోపు అప్పు తీసుకున్న రైతుకు మాత్రమే సున్నా వడ్డీ వర్తిస్తుందని... అది కూడా రైతు ముందుగా లక్షకు 7000 చెల్లించాలని ఆయన దుయ్యబట్టారు.

స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, ఈ క్రాప్ లో నమోదు నిబంధనలతో వారిలో కూడా ఎక్కువమందికి ఎగనామం పెడుతున్నారని.. ఈ క్రాప్ నమోదుతో రైతుల తమ పంటలే అమ్ముకోలేకపోతున్నారని ఉమా ధ్వజమెత్తారు.

లక్ష రూపాయల పైన అప్పు తీసుకున్న రైతుకు సున్నావడ్డీ, పావలా వడ్డి పూర్తిగా ఎగ్గొట్టారని దేవినేని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 3 లక్షల అప్పుతీసుకున్న రైతుకు మొదటి లక్ష రూపాయలకు సున్నా వడ్డీ మిగిలిన రెండు లక్షలకు పావలా వడ్డీ అనగా 3లక్షలకు 6 వేలు చెల్లిస్తే సరిపోయేదని ఆయన గుర్తుచేశారు.

అలాగే 3 లక్షలు అప్పు తీసుకున్న రైతు గతంలో 6000 చెల్లించే వారని.. ప్పుడు రైతు 21000 వడ్డీ చెల్లించాల్సిందేనని దేవినేని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 9,000 రాయితీ పోనూ రైతు 12,000 భరించాలన్నారు.

3లక్షలు అప్పు తీసుకున్న రైతు 6000 చెల్లించాల్సింది 12000 చెల్లించడమంటే  3సార్లుగా ఇస్తున్న రైతు భరోసా 6,500 లాక్కొంటున్నారని ఉమా మండిపడ్డారు. ప్రస్తుత పధకంలో 2ఎకరాల పైన మెట్టభూమి, 2ఎకరాల పైన చెరకు, 3 ఎకరాల పైన వరి పండించే రైతులకు  సున్నా వడ్డీ వర్తించదని దేవినేని తెలిపారు.

రైతుకు అవసరమయ్యే యంత్ర పరికరాల సబ్సిడీ, సూక్ష్మపోషకాలు, బిందు తుంపర సేద్యం రాయితి పూర్తిగా మాయమని దేవినేని ఉమా ధ్వజమెత్తారు. 
 

click me!