భీమవరంలో గర్భిణికి చికిత్స: క్వారంటైన్‌లో 12 మంది వైద్య సిబ్బంది

By narsimha lode  |  First Published Jul 12, 2020, 5:45 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించుకొన్న గర్భిణికి కరోనా సోకడంతో ముగ్గురు వైద్యులతో పాటు 12 మందిని హోం క్వారంటైన్ కి వెళ్లాలని అధికారులు కోరారు.



భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించుకొన్న గర్భిణికి కరోనా సోకడంతో ముగ్గురు వైద్యులతో పాటు 12 మందిని హోం క్వారంటైన్ కి వెళ్లాలని అధికారులు కోరారు.

also read:గర్భిణికి అందని చికిత్స, 2 రోజులు అంబులెన్స్‌లోనే: కడుపులోనే శిశువు మృతి

Latest Videos

undefined

కృష్ణా జిల్లా మండపల్లి మండలం గన్నవరం గ్రామానికి చెందిన గర్బిణికి పురిటినొప్పులు రావడంతో ఈ నెల 10వ తేదీన భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఆమెకు శస్త్రచికిత్స నిర్వహిస్తే ఆడపిల్ల జన్మించింది.

also read:24 గంటల్లో 19 మంది మృతి: ఏపీలో 29,168కి చేరిన కరోనా కేసులు

అదే రోజు ఆమెకు కరోనా  పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్ గా తేలింది. దీంతో తల్లీబిడ్డలను ఏలూరులోని కరోనా ఆసుపత్రికి తరలించారు. గర్భిణికి వైద్యం చేసిన వైద్యులు, వైద్య సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.  గర్భిణికి  చికిత్స చేసిన ముగ్గురు వైద్యలతో పాటు తొమ్మిది మంది సిబ్బందిని హోం క్వారంటైన్ లో ఉండాలని వైద్య శాఖాధికారులు ఆదేశించారు. 

ఏపీ రాష్ట్రంలో ఆదివారం నాటికి  కరోనా కేసులు 29,168కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లో 1933 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా  కరోనాతో 328 మరణించారు.

click me!