పవన్‌కు కేంద్రం భద్రత కల్పించాలి.. ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించిన జగన్ ఆశ తీరదు: ఆదినారాయణ రెడ్డి

Published : Jun 19, 2023, 04:00 PM IST
పవన్‌కు కేంద్రం భద్రత కల్పించాలి.. ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించిన జగన్ ఆశ తీరదు: ఆదినారాయణ రెడ్డి

సారాంశం

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రాణ హాని ఉందని బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. వైసీసీ వారికి అడ్డం వస్తే ఎవరినైనా ఏమైనా చేస్తుందని ఆరోపించారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రాణ హాని ఉందని బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. వైసీసీ వారికి అడ్డం వస్తే ఎవరినైనా ఏమైనా చేస్తుందని ఆరోపించారు. ప్రాణహాని ఉందని పవన్ కల్యాణ్‌కు ఇప్పుడు తెలుసుకున్నారని అన్నారు. పవన్ తమతో కలిసి పనిచేస్తుండటంతో ఆయనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పవన్ ఎదిగితే వైసీపీ నేతలు తట్టుకుంటారా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలది అధికారం కోసం ఎంతకైనా తెగించే మనస్తత్వం అని అన్నారు. పవన్‌కు భద్రత విషయంలో కేంద్రం జోక్యం  చేసుకోవాలని కోరారు. పవన్‌ కల్యాణ్‌కు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

ఎన్ని కోట్లు సంపాదించిన సీఎం జగన్ ఆశ తీరదని విమర్శలు గుప్పించారు. జగన్ నిత్య అసంతృప్తి వాది అని అన్నారు. జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని.. వైసీపీ పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అన్నింట్లోనూ సకల శాఖల మంత్రి జోక్యమేనని విమర్శలు గుప్పించారు. వివేకా హత్య కేసును అంతులేని కథగా మార్చేశారని విమర్శించారు. ఈ కేసు అంతులేని కథ జూలై 3న సుప్రీంకోర్టులో అంతం కానుందని అన్నారు

ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు రాష్ట్రంలో పాలన ఎలా ఉందనే దానిపై సంకేతాలు ఇచ్చారని అన్నారు. ఏపిలో ఇళ్ల కోసం కేంద్రం నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుంటుందని విమర్శించారు. లిక్కర్ కింగ్‌లు స్టిక్కర్ కింగ్‌లుగా మారారంటూ ఎద్దేవా చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?