ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు... చంద్రబాబు ఫైర్

By telugu teamFirst Published Feb 11, 2020, 12:19 PM IST
Highlights

విద్యుత్ ఒప్పందాల రద్దు దేనికి అని అడిగితే ప్రజల మీద కరెంటు చార్జీల భారం తగ్గించడానికి అన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు పెంచారు? ఇప్పటికే పరిశ్రమలకు రాయితీలను ఇవ్వడం ఆపేసారు. ఇప్పుడీ కరెంటు చార్జీల భారంతో పరిశ్రమలు ఎలా నిలదొక్కుకుంటాయి?
 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఇటీవల ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా... దీనిపై చంద్రబాబు స్పందించారు. ప్రజలపై భారాన్ని మోపుతున్నారంటూ మండిపడ్డారు. ఈ మేరకు చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Also Read చంద్రబాబు కోటరీ: వారికి చుక్కలు చూపిస్తున్న జగన్ సర్కార్...

‘‘పరిపాలన చేతకాక వ్యవస్థలన్నిటినీ దిగజార్చి, ఆర్థికంగా కుదేలు చేసి.. ఇప్పుడా భారాన్ని ప్రజల మీద వేయడం ఎంత దుర్మార్గం. ఆర్టీసీ బస్సు చార్జీలు, పెట్రోలు చార్జీలు, ఫైబర్ గ్రిడ్ చార్జీలు, ఇప్పుడు విద్యుత్ చార్జీలు... సామాన్యుడి మీద ఏంటీ ఆర్థిక భారం?

విద్యుత్ ఒప్పందాల రద్దు దేనికి అని అడిగితే ప్రజల మీద కరెంటు చార్జీల భారం తగ్గించడానికి అన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు పెంచారు? ఇప్పటికే పరిశ్రమలకు రాయితీలను ఇవ్వడం ఆపేసారు. ఇప్పుడీ కరెంటు చార్జీల భారంతో పరిశ్రమలు ఎలా నిలదొక్కుకుంటాయి?

ఇప్పటికే మీ వేధింపులు, బెదిరింపులకు అనేక పరిశ్రమలు వెళ్లిపోయాయి. ఇప్పుడీ చార్జీల భారంతో వున్నవాళ్లు కూడా వెళ్లిపోయేలా చేస్తున్నారు. నాడు టీడీపీ హయాంలో "పెట్టుబడుల గమ్యస్థానం” అనిపించుకున్న ఏపీ, నేడు వైసీపీ పాలనలో “పరిశ్రమల గల్లంతు స్థానం” అవడం బాధేస్తోంది.

భవిషత్తులో కరెంట్ చార్జీలు పెంచేది లేదని చెప్పిన మాట నిలబెట్టుకుంది తెలుగుదేశం. చార్జీలు పెంచం అని నమ్మించి మోసం చేసింది వైసీపీ. ఒక్క ఛాన్స్ ఇమ్మని కాళ్ళు గడ్డాలు పట్టుకుని, అధికారంలోకి వచ్చింది, ఇలా మోయలేని భారాలు ప్రజలపై వేసేందుకేనా? ఇదేనా మీ విశ్వసనీయత? ఇది నయవంచన కాదా?’’ అంటూ  చంద్రబాబు ట్వీట్ చేశారు.

click me!