బీహార్‌కు ప్రత్యేక హోదా వచ్చేలా వుంది.. ఏపీకీ అడగండి: జగన్ సహా నేతలకు మాజీ జేడీ లక్ష్మీనారాయణ సూచన

Siva Kodati |  
Published : Dec 16, 2021, 05:14 PM ISTUpdated : Dec 16, 2021, 05:17 PM IST
బీహార్‌కు ప్రత్యేక హోదా వచ్చేలా వుంది.. ఏపీకీ అడగండి: జగన్ సహా నేతలకు మాజీ  జేడీ లక్ష్మీనారాయణ సూచన

సారాంశం

బీహార్ కు ప్రత్యేక హోదా అంశాన్ని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పరిశీలిస్తున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయని లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడానికి 14వ ఆర్థిక సంఘం అడ్డంకి కాదనే వాస్తవాన్ని ఈ విషయం నిరూపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఏపీ సహా మరే ఇతర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి 14వ ఆర్థిక సంఘం సిఫారసులు అంగీకరించవని కేంద్రం గతంలో పలుమార్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ కు ప్రత్యేక హోదా అంశాన్ని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పరిశీలిస్తున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయని లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడానికి 14వ ఆర్థిక సంఘం అడ్డంకి కాదనే వాస్తవాన్ని ఈ విషయం నిరూపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై సీఎం జగన్, అన్ని పార్టీల నేతలు వెంటనే దృష్టి సారించాలని లక్ష్మీనారాయణ సూచించారు.

కాగా.. ఆంధ్రప్రదేశ్‌కు (andhra pradesh) ప్రత్యేక హోదా (special status) అనేది ముగిసిపోయిన అంశమని కేంద్ర ప్రభుత్వం (govt of india) మరోసారి తేల్చిచెప్పింది.  ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై టీడీపీ (tdp) ఎంపీ రామ్మోహన్ నాయుడు (ram mohan naidu) పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ (nityanand rai) లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్నింటినీ పూర్తి చేసేందుకు ఎప్పటికప్పుడు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలతోపాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో ఇప్పటి వరకు 25 సమీక్షా సమావేశాలు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. 

ALso Read;మాట తప్పారు, మడమ తిప్పారు: ప్రత్యేక హోదా, రైల్వే జోన్ పై జగన్ పై బాబు ఫైర్

రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నామని... 14వ ఆర్థిక సంఘం సిఫారసులతో ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయిందని కేంద్రం స్పష్టం చేసింది. అందువల్ల 2015-16 నుంచి 2019-20 మధ్య కేంద్ర ప్రాయోజిత పథకాలను 90:10 నిష్పత్తి కింద వచ్చే మొత్తాన్ని ప్రత్యేక సాయంగా ఏపీకి ఇచ్చేందుకు అంగీకరించామని నిత్యానందరాయ్ వెల్లడించారు. 2015-16 నుంచి 2019-20 వరకు కుదుర్చుకున్న విదేశీ రుణాలకు సంబంధించిన అసలు, వడ్డీని కూడా కేంద్రమే చెల్లిస్తుంది.’’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం మరోసారి లోక్‌సభలో స్పష్టం చేసింది. ప్రత్యేక సాయం చేయడానికి కేంద్రం అంగీకారం తెలిపామని.. విభజన చట్టంలో చాలా అంశాలు అమలయ్యాయని, మిగిలిన వాటికి కొంత సమయం ఉందని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్