వైశ్యుల జోలికొస్తే కాళ్ళు విరగ్గొట్టండి..

Published : Oct 06, 2017, 02:22 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
వైశ్యుల జోలికొస్తే కాళ్ళు విరగ్గొట్టండి..

సారాంశం

కంచె ఐలయ్య రాసిన ‘కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు’ పుస్తకంపై లొల్లి మెల్లిగా రాష్ట్రంలో కూడా రాజకీయ రంగు పులుముకుంటోంది. తాజాగా టిడిపి ఏలూరు ఎంపి మాగంటి బాబు శుక్రవారం చేసిన వ్యాఖ్యలు అవే సంకేతాలను పంపుతోంది.

కంచె ఐలయ్య రాసిన ‘కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు’ పుస్తకంపై లొల్లి మెల్లిగా రాష్ట్రంలో కూడా రాజకీయ రంగు పులుముకుంటోంది. తాజాగా టిడిపి ఏలూరు ఎంపి మాగంటి బాబు శుక్రవారం చేసిన వ్యాఖ్యలు అవే సంకేతాలను పంపుతోంది. ఐలయ్య పుస్తకం గురించి మాగంటి ప్రస్తావిస్తూ ‘‘ఎవరైనా వైశ్యుల జోలికొస్తే కాళ్ళు విరగ్గొట్టండి’ అంటూ పిలుపునివ్వటం వివాదాస్పదమైంది. ‘వైశ్యుల వెనుకు తాను మద్దతుగా ఉన్నాను’ అంటూ ప్రకటించారు. దాంతో ఇప్పటి వరకూ తెలంగాణాలో మాత్రమే జరుగుతున్న రచ్చ మెల్లిగా ఏపికి కూడా పాకేట్లే కనబడుతోంది. అందులోనూ ఆమధ్య చంద్రబాబునాయుడు మాట్లాడుతూ పుస్తకాన్ని రాష్ట్రంలో నిషేధిస్తున్నట్లు చేసిన ప్రకటన కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది.

పుస్తకం రాయటాన్ని ఒకవైపు ఐలయ్య సమర్ధించుకుంటూ మాట్లాడుతుండటంతో వివాదం తారాస్ధాయికి చేరుకుంటోంది. అందులో భాగంగానే వైశ్య సామాజికవర్గానికి చెందిన అనేకమంది ఆయనపై పదుల సంఖ్యలో పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. టిడిపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ గతంలోనే ఐలయ్యకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసారు. ఇపుడు మరో ఎంపి మాగంటి కూడా తోడయ్యారు. అంటే ముందు ముందు ఇంకెతమంది టిడిపి నేతలు ఐలయ్యకు వ్యతిరేకంగా గొంతు విప్పుతారో చూడాలి.

PREV
click me!

Recommended Stories

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లోఫుడ్ కమీషన్ చైర్మన్ తనిఖీ | Asianet News Telugu
LVM3-M6 Success Story | ప్రపంచానికి భారత్ సత్తా చాటిన ఇస్రో బాహుబలి | Asianet News Telugu