‘నంద్యాల’ వల్లే కెఇ జెండా ఎగరేస్తున్నారు

First Published Aug 11, 2017, 7:10 AM IST
Highlights
  • గడచిన మూడేళ్ళుగా కర్నూలు జిల్లాకు చెందిన ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ మంత్రి కెఇ కృష్ణమూర్తికి ఆగస్టు 15వ తేదీన జాతీయ జెండా ఆవిష్కరించే భాగ్యం దక్కలేదు.
  • ఎందుకంటే, మంత్రివర్గంలోనే సీనియరైన కెఇతో చంద్రబాబుకు పడటం లేదు.
  • సరే, ఏదో కారణాలు చెప్పి జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతల నుండి పక్కన పెట్టేసారు కెఇని.
  • ఓ మంత్రి జెండా ఎగరేయాలంటే ఏదో ఓ జిల్లాకు ఇన్ఛార్జ్ అయివుండాలి. కెఇ ఏ జిల్లాకూ ఇన్ఛార్జ్ కాదు.

నంద్యాల ఉపఎన్నిక చంద్రబాబునాయుడులో  ఓ రేంజిలో గుబులు రేపుతున్నట్లే ఉంది. ఆగస్టు 15 జెండా ఆవిష్కరణ వ్యవహారంలో స్పష్టమవుతోంది. గడచిన మూడేళ్ళుగా కర్నూలు జిల్లాకు చెందిన ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ మంత్రి కెఇ కృష్ణమూర్తికి ఆగస్టు 15వ తేదీన జాతీయ జెండా ఆవిష్కరించే భాగ్యం దక్కలేదు. ఎందుకంటే, మంత్రివర్గంలోనే సీనియరైన కెఇతో చంద్రబాబుకు పడటం లేదు. సరే, ఏదో కారణాలు చెప్పి జెండా ఆవిష్కరణ బాధ్యతల నుండి దూరంగా పెట్టేసారు. ఎలాగంటే, ఓ మంత్రి జెండా ఎగరేయాలంటే ఏదో ఓ జిల్లాకు ఇన్ఛార్జ్ అయివుండాలి. కెఇ ఏ జిల్లాకూ ఇన్ఛార్జ్ కాదు.

మామూలుగా అయితే, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు మాత్రమే జెండా ఆవిష్కరణ అవకాశం దక్కుతుంది. కెఇ ఏ జిల్లాకు ఇన్చార్జ్ కాదు కాబట్టి ఆ అదృష్ణం దక్కలేదు. మరో నాలుగు రోజుల్లో వస్తున్న జెండా పండుగ విషయంలో ఏ మంత్రి ఏ జిల్లాలో జెండా ఆవిష్కరిస్తారు అనే విషయంలో రెండు రోజుల క్రితమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారం కర్నూలు జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి కాలువ శ్రీనివాసులు జెండా ఎగురవేస్తారు.

అయితే, సమస్య ఇక్కడే వచ్చింది. ఏంటంటే, ప్రస్తతం నంద్యాల ఉపఎన్నికలో గెలవటానికి టిడిపి పడుతున్న అవస్తలు అందరూ చూస్తున్నదే. నంద్యాల నియోజకవర్గం కర్నూలు జిల్లాలోనే ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అసలే, కెఇకి చంద్రబాబుకు మధ్య సంబంధాలు అంతంతమాత్రం. దానికితోడు ఉపఎన్నిక సందర్భంగా వచ్చిన ఆగస్టు 15కు జెండా ఆవిష్కరణ అవకాశం స్ధానిక మంత్రి కెఇకి ఇవ్వకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు భావించినట్లున్నారు. అందుకే రెండు రోజుల క్రితం జారీ చేసిన ఉత్తర్వుల్లో మార్పులు చేసారు. కర్నూలు జిల్లాలో జెండా ఎగరేసే అవకాశం కాలువ శ్రీనివాసులుకు బదులు కెఇకి అప్పగిస్తూ ప్రభుత్వం తాజాగా మరో ఉత్తర్వును జారీ చేసింది.

click me!