ఒక్క సారి కాదు ల‌క్ష సార్లు ఉరి తీయాలి

Published : Aug 10, 2017, 06:27 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
ఒక్క సారి కాదు ల‌క్ష సార్లు ఉరి తీయాలి

సారాంశం

జగన్ కామెంట్లకు తిరిగి ఫైర్ అయినా టీడీపీ నేతలు లక్ష సార్లు ఉరి తీయాలని టీడీపీ ఎమ్మెల్సీ.

నంద్యాల ఉప ఎన్నిక టీడీపీ , వైసీపి పార్టీల మ‌ధ్య యుద్దాన్ని మించి త‌ల‌పిస్తోంది, ఒక పార్టీ నాయ‌కుడు కామెంట్ చేస్తే మ‌రో పార్టీ నాయ‌కుడు ఆ కామెంట్ కు కౌంట‌ర్ ఇస్తున్నారు. బాబు పై జగన్ చేసిన కామెంట్లకు టీడీపీ నేతలు అదే స్థాయిలో స్పందిస్తున్నారు. 

 నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చారంలో ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తోన్న వ్యాఖ్య‌ల‌కు టీడిపి నేత‌లు  దుమ్మేత్తి పోస్తున్నారు. జ‌గ‌న్, చంద్ర‌బాబును ఉరితీయాల‌న్నా కామెంట్ల‌కు టీడీపీ ఎమ్మెల్సీ అన్నం స‌తీశ్ ప్ర‌భాక‌ర్ తిప్పికొట్టారు. జ‌గ‌న్ కు మ‌తిభ్ర‌మించి మాట్లాడుతున్నారని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నేత‌గా పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారని, ఆయ‌న చేస్తోన్న‌ వ్యాఖ్య‌లు ఆయ‌న దిగ‌జారుడుత‌న‌నానికి నిద‌ర్శ‌నమ‌ని వ్యాఖ్యానించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ఉరితీసినా త‌ప్పులేద‌ని జ‌గ‌న్ ఈ రోజు వ్యాఖ్య‌లు చేశార‌ని స‌తీశ్ మండిప‌డ్డారు. జ‌గ‌న్‌నే ల‌క్ష‌సార్లు ఉరితీయాల‌ని అన్నారు. జ‌గ‌న్ వ్యాఖ్య‌ల పై టీడీపీ శ్రేణులు విరుచుకుప‌డుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

కొడుకుమీద ఈగ వాలనివ్వని తండ్రి | Chandrababu Speech Today | Asianet News Telugu
బాబుకు కొత్త బిరుదు ఇచ్చిన నిమ్మల | Nimmala Ramanaidu Speech | Asianet Telugu