ద్వారకా తిరుమలలో గోల్డ్ స్కామ్... సామాన్యులకు మూడున్నర కోట్లు కుచ్చుటోపి

By Arun Kumar PFirst Published Jul 21, 2021, 4:20 PM IST
Highlights

అమాయక ప్రజల ఆశను ఆసరాగా చేసుకుని గోల్డ్ స్కీమ్ పేరిట భారీ మోసానికి పాల్పడ్డాడు ద్వారకా తిరుమలలోని ఓ బంగారు వ్యాపారి. ఇలా దాదాపు మూడున్నర కోట్లు దోచుకుని కుటుంబంతో పరారయ్యాడు. 

అమరావతి:  గోల్డ్ స్కీమ్ పేరుతో ఓ జ్యువెల్లరీ షాప్ యజమాని భారీ స్కామ్ కు పాల్పడ్డాడు. అమాయక ప్రజలకు ఆశనే ఆసరాగా చేసుకుని దాదాపు మూడున్నర కోట్లకుపైగా దోచేశాడు. ఈ గోల్డ్ స్కాం పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకట గణేష్ జ్యూవెలరీ యజమాని రాజా కొంతకాలంగా గోల్డ్ స్కీమ్ పేరుతో అమాయకులను ఆకర్షించాడు.  15 నెలలపాటు నెలకు రూ.2వేల చొప్పున రూ. 30వేలు చెల్లిస్తే 16వ నెల బోనస్‌గా మరో రెండువేలు కలిపి రూ. 32 వేలకు బంగారం గానీ, వెండి వస్తువులు గానీ ఇస్తామంటూ నమ్మబలికాడు. ఆయన మాటలు నమ్మిన స్థానికులు పెద్ద ఎత్తున వాయిదాలు కట్టారు. 

VIDEO  విజయవాడలో భారీ మోసం... సామాన్యులకు రూ.4కోట్లు టోకరా Volume 90% Loading ad

ప్రతి నెలా వాయిదా డబ్బులను వసూలు చేసుకుని తీరా స్కీమ్ ముగిసే తరుణంలో రాజా తన కుటుంబంతో కలిసి పారిపోయాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ గోల్డ్ స్కీమ్ బాధితులు రెండు వందల మంది వరకు ఉంటారని తెలుస్తోంది. వీరందరి నుండి సేకరించిన డబ్బు మూడున్నర కోట్లకుపైగా వుంటుందని భావిస్తున్నారు. ఇలా బంగారం వ్యాపారి చేతిలో మోసపోయిన బాధితులు ద్వారకా తిరుమలలో ఆందోళనకు దిగారు.
 

click me!