మాస్క్ పెట్టుకోని జగన్ కు ఏ శిక్ష విధిస్తారు??.. నారా లోకేష్ ఫైర్...

Published : Jul 21, 2021, 03:58 PM IST
మాస్క్ పెట్టుకోని జగన్ కు ఏ శిక్ష విధిస్తారు??.. నారా లోకేష్ ఫైర్...

సారాంశం

దళితులంటే సీఎం జగన్ రెడ్డికి ఎందుకంత కక్ష అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ ప్రశ్నించారు. చీరాలలో దళిత యువకుడు కిరణ్ కుమార్ ను మాస్క్ లేదని, వైసీపీ పోలీసులు కొట్టి చంపి ఏడాదైందని గుర్తు చేశారు. 

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ ఏపీ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. ఏ రోజూ మాస్క్ పెట్టుకోని జగన్ కు ఏ శిక్ష విధించాలంటూ మండిపడ్డారు.

దళితులంటే సీఎం జగన్ రెడ్డికి ఎందుకంత కక్ష అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ ప్రశ్నించారు. చీరాలలో దళిత యువకుడు కిరణ్ కుమార్ ను మాస్క్ లేదని, వైసీపీ పోలీసులు కొట్టి చంపి ఏడాదైందని గుర్తు చేశారు. 

నిందితులైన పోలీసులమీద ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, జగన్ రెడ్డి ఫ్యాక్షన్ పాలనలో దళితులకు బతికే హక్కులేదా? అని లోకేష్ ప్రశ్నించారు. మాస్క్ పెట్టుకోకపోవడమే నేరమైతే.. రోజూ మాస్క్ పెట్టుకోని జగన్ రెడ్డికి ఏ శిక్ష విధిస్తారు? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కిరణ్ మృతికి కారణమైన వారిని శిక్షించాలని, కిరణ్ కుమార్ కుటుంబానికి రూ. 50 లక్షలు పరిహారం ఇవ్వలని లోకేష్ డిమాండ్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం
అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu