విశాఖ మన్యంలో మావోలు, పోలీసుల మధ్య బుధవారం నాడు ఎదురు కాల్పులు చోటు చేసుకొన్నాయి. పోలీసుల కాల్పుల నుండి మావోలు తప్పించుకొన్నారు.
విశాఖపట్టణం: విశాఖ జిల్లా పెద్దంపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం నాడు పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకొన్నాయి.పెద్దంపల్లి ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకొన్నాయి. పోలీసుల కాల్పుల నుండి తప్పించుకొని మావోయిస్టులు అడవిలోకి పారిపోయారు.
తప్పించుకొన్న మావోయిస్టు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.విశాఖ జిల్లాలోని మన్యం ప్రాంతంలో తరచుగా మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులు చోటు చేసుకొంటున్నాయి. ఒడిశాఖకు సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. మావోయిస్టుల ఏరివేతకు పోలీసులు చర్యలు తీసుకొంటున్నారు.
విశాఖ జిల్లాలో మావోయిస్టు ల కదలికలు ఉన్న ప్రాంతాల్లో పోలీసులు నిఘాను మరింత ముమ్మరం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభహివృద్ది కార్యక్రమాలపై కూడ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది.ఈ ప్రాంతంలోని యువతకు ఉపాధి కల్పించడంపై పాలకులు దృష్టి పెడుతున్నారు. ప్రభుత్వం, పోలీసులు తీసుకొంటున్న చర్యలతో మావోయిస్టుల్లో రిక్రూట్‌మెంట్ భారీగా తగ్గిపోయిందని లొలంగిపోయిన మావోలు చెప్పారు.