శ్రీశైలంలో మళ్లీ డ్రోన్ల కలకలం: పోలీసుల అదుపులో అనుమానితుడు

Published : Jul 05, 2021, 08:54 PM IST
శ్రీశైలంలో మళ్లీ డ్రోన్ల కలకలం: పోలీసుల అదుపులో అనుమానితుడు

సారాంశం

కర్నూల్ జిల్లాలోని శ్రీశైలంలో మరోసారి డ్రోన్లు కలకలం సృష్టించాయి. గత వారంలో నాలుగు రోజుల పాటు డ్రోన్లు  కన్పించడంతో పోలీసులు వాటిని పట్టుకొనేందుకు ప్రయత్నించారు. సోమవారం నాడు రాత్రి కూడ డ్రోన్లు కన్పించడంతో పోలీసులు వాటి కోసం అన్వేషించారు. 


కర్నూల్: కర్నూల్ జిల్లాలోని శ్రీశైలంలో మరోసారి డ్రోన్లు కలకలం సృష్టించాయి. గత వారంలో నాలుగు రోజుల పాటు డ్రోన్లు  కన్పించడంతో పోలీసులు వాటిని పట్టుకొనేందుకు ప్రయత్నించారు. సోమవారం నాడు రాత్రి కూడ డ్రోన్లు కన్పించడంతో పోలీసులు వాటి కోసం అన్వేషించారు. 

also read:శ్రీశైలంలో డ్రోన్ల కలకలం: పట్టుకొనేందుకు పోలీసుల యత్నం

డ్రోన్ల విషయమై  ఇప్పటికే ఓ అనుమానితుడిని శ్రీశైలం పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. శ్రీశైలం ఆలయం సమీపంలో డ్రోన్ తిరగడం  కలకలం రేపుతోంది.ఆలయం సమీపంలోని  ఈఓ క్వార్టర్స్, ఔటర్ రింగ్ రోడ్డు, మల్లమ్మ కన్నేరు, ఉత్తర పార్క్, విశ్వమిత్ర మఠం రిజర్వాయర్ తదిరత ప్రాంతాల్లో డ్రోన్లు  తిరిగినట్టుగా స్థానికులు చెప్పారు.డ్రోన్లను  శ్రీశైలం ఆలయ ఈవో కూడ చూశారు.  ఆలయ సమీపంలో కన్పించిన డ్రోన్ వెంటనే  అడవి ప్రాంతం వైపునకు వెళ్లిందని  ఆయన తెలిపారు.ఈ ప్రాంతంలో డ్రోన్ల వినియోగానికి తాము ఎవరికి అనుమతి ఇవ్వలేదని ఆలయ ఈవో ప్రకటించారు. 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!