డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో సీసీ పుటేజీలో ఉన్నవారిపై కేసు నమోదు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. మూడు నెలల్లోపుగా ట్రయల్ కోర్టులో చార్జీషీట్ దాఖలు చేయాలని కోరింది.
అమరావతి: అమరావతి: డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసును సీబీఐకి ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఈ హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని సుబ్రమణ్యం తల్లిదండ్రులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు సీబీఐ విచారణకు నిరాకరిస్తూ బుధవారంనాడు ఆదేశాలు ఇచ్చింది. డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో సీసీ పుటేజీలో ఉన్న వారిపై కేసు నమోదు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. సీసీపుటేజీకి సంబంధించి ఎఫ్ఎస్ ఎల్ రిపోర్టును 15 రోజుల్లో తెప్పించుకోవాలని దర్యాప్తు అధికారికి సూచించింది ఏపీ హైకోర్టు. నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.మూడు మాసాల్లో తుది చార్జీషీట్ ను దాఖలు చేయాలని కూడా హైకోర్టు కోరింది.
వైసీపీ నుండి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద డ్రైవర్ గా పనిచేసి మానేసిన సుబ్రమణ్యం 2022 మే 19వ తేదీన అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. సుబ్రమణ్యం డెడ్ బాడీని ఎమ్మెల్సీ అనంతబాబు తన కారులో ఇంటికి తీసుకువచ్చాడు. అనంతబాబే తన కొడుకును హత్యచేశారని పేరేంట్స్ చెబుతున్నారు.ఈ విషయమై ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలకు విపక్షాలు కూడా మద్దతుగా నిలిచాయి. దీంతో ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మద్యం తాగొద్దని ఎమ్మెల్సీ అనంతబాబు చేయి చేసుకోవడంతో రాయిపడడంతో సుబ్రమణ్యం మృతి చెందినట్టుగా అప్పట్లో జిల్లా ఎస్పీ ప్రకటించారు.
undefined
ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో పోలీసులు వ్యవహరించిన తీరును సుబ్రమణ్యం పేరేంట్స్, విపక్షాలు తప్పుబట్టాయి. పోలీసుల విచారణ పారదర్శకంగా లేదని కూడా వారు ఆరోపించారు.. ఎమ్మెల్సీ అనంతబాబు మనుషులు తమను బెదిరింపులకు కూడ గురి చేశారని కూడా సుబ్రమణ్యం పేరేంట్స్ గతంలో ప్రకటించారు. ఈ ఘటనల నేపథ్యంో ఈ కేసును సీబీఐతో విచారణ చేయించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో సుబ్రమణ్యం పేరేంట్స్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
also read:ఎట్టకేలకు జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ అనంతబాబు.. ఈ షరతులు ఉల్లంఘిస్తే..?
ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును 2022 మే 23న పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రైవర్ సుబ్రమణ్యంది హత్యేనని పోస్టుమార్టం నివేదిక తేల్చిందని పోలీసులు అప్పట్లో ప్రకటించారు. సుబ్రమణ్యంను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. గత ఏడాది డిసెంబర్ 14న ఎస్సీ,ఎస్టీ కోర్టు కోర్టు ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ మంజూరు చేసింది. షరతుతలో బెయిల్ ఇచ్చింది. అదే రోజున ఆయన జైలు నుండి విడుదలైన విషయం తెలిసిందే.