కుప్పం గడ్డూరు వద్ద టెన్షన్: టీడీపీ శ్రేణులు , పోలీసుల మధ్య తోపులాట

By narsimha lode  |  First Published Jan 4, 2023, 2:27 PM IST

చిత్తూరు జిల్లాలోని కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో గడ్డూరు క్రాస్ రోడ్  వద్ద  టీడీపీ శ్రేణులను  పోలీసులు అడ్డుకున్నారు.  చంద్రబాబుకు  స్వాగతం పలికేందుకు  వెళ్తున్న పార్టీ శ్రేణులను  పోలీసులు  అడ్డుకున్నారు. దీంతో  టెన్షన్ నెలకొంది. 


చిత్తూరు: జిల్లాలోని కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో బుధవారం నాడు టెన్షన్ నెలకొంది.  ఇవాళ్టి నుండి మూడు రోజుల పాటు  నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే  రోడ్లపై   లు, ర్యాలీలు, సభలు రోడ్ షో  లు నిర్వహించడంపై నిషేధం విధించింది. దీంతో  నిబంధనలకు విరుద్దంగా  వ్యవహరిస్తే  కేసులు నమోదు చేస్తామని పోలీసులు టీడీపీ నాయకులకు నోటీసులు జారీ చేశారు.  టీడీపీకి చెందిన ప్రచార రథాలు , లౌడ్ స్పీకర్లున్న వాహనాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.  వీటిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

బెంగుళూురు నుండి  వస్తున్న చంద్రబాబుకు  స్వాగతం పలికేందుకు  గడ్డూరు వద్దకు  భారీగా టీడీపీ శ్రేణులు చేరుకున్నాయి. శాంతిపురం మండలం కేకుమాకులపల్లిలో  ఏర్పాటు చేసిన స్టేజీని పోలీసులు తొలగించారు.  పోలీసులతో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు వాగ్వావాదానికి దిగారు.  శాంతిపురం మండలంలోని గడ్డూరు వద్ద పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య  వాగ్వాదం చోటు చేసుకుంది.  తోపులాట నెలకొంది.  దీంతో  ఉద్రిక్తత నెలకొంది. నిబంధనల మేరకు అనుమతిని తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. అయితే  పోలీసుల  నిబంధనలపై టీడీపీ నేతలు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.    

Latest Videos

undefined

also read:చంద్రబాబు కుప్పం టూర్ పై కొనసాగుతున్న ఉత్కంఠ: నోటీసులిచ్చిన పోలీసులు

చంద్రబాబునాయుడు  రోడ్ షో కు  అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.  టీడీపీ శ్రేణులు, ఆ  పార్టీ శ్రేణుల వాహనాలు వెళ్లకుండా  పోలీసులు రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్లను  టీడీపీ శ్రేణులు తొలగించాయి.   ఎక్కడ, ఎంతమందితో  సభలు నిర్వహిస్తారో  చెబితే  అనుమతి ఇస్తామని  పోలీసులు చెబుతున్నారు.  రోడ్ షోలకు  అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.  నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన   టీడీపీ స్టేజీలను  పోలీసులు  తొలగించారు. 

తమపై పోలీసులు లాఠీచార్జీ చేశారని  టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి,. అయితే తాము లాఠీచార్జీ చేయలేదని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. పోలీసులు,  టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాటలో  మహిళలు స్పృహ తప్పి పడిపోయారు.  తమ ఎమ్మెల్యే తమ నియోజకవర్గానికి రాకుండా అడ్డుకోవడమేమిటని  టీడీపీ కార్యకర్తలు  ప్రశ్నిస్తున్నారు. 

నియోజకవర్గంలోని పలు  గ్రామాల్లో సభలకు సంబందించి  టీడీపీ నేతలు  అనుమతి కోసం  ధరఖాస్తు  చేశారని పోలీసులు  చెప్పారు. అయితే  వీటి విషయమై తాము లేవనెత్తిన ప్రశ్నలకు  టీడీపీ నేతల నుండి సమాధానం రాలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ సభాస్థలం వద్ద  సెక్యూరిటీ కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారు. ఎంత మందిని సమీకరిస్తున్నారు, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల గురించి సమాచారం అడిగితే తమకు సమాచారం రాలేదని పోలీసులు గుర్తు చేస్తున్నారు.ఈ సమాచారాన్ని తాము అడిగామని  పోలీసులు చెబుతున్నారు. చంద్రబాబు వచ్చిన తర్వాత కూడా ఇదే విషయమై  చెబుతామన్నారు.  

click me!