పవన్‌ను వీక్ చేసేందుకు జగన్, కేసీఆర్‌ల కుట్ర.. వియ్యంకుడు బీఆర్ఎస్‌లో చేరడంపై వీర్రాజు ఏమంటారు?: కన్నా సంచలనం

By Sumanth KanukulaFirst Published Jan 4, 2023, 3:00 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు  చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్‌ల కుట్రలో భాగంగానే బీఆర్ఎస్‌లోకి ఏపీ నేతలు వెళ్తున్నారని ఆరోపించారు. 

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు  చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్‌ల కుట్రలో భాగంగానే బీఆర్ఎస్‌లోకి ఏపీ నేతలు వెళ్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌ను, తెలంగాణ తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను వీక్ చేసే కుట్ర జరుగుతుందోని అన్నారు. జగన్, కేసీఆర్‌ ఇద్దరూ కలిసే ఈ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరూ బతికి ఉండకూడదని జగన్ ఆలోచన అని విమర్శించారు. జగన్‌ది పాలన కాదని.. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని మండిపడ్డారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఏ రాజకీయ నేతను బతకనీయరని ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజకీయ పక్షాలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఏపీలోని కాపు నేతలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టిందని అన్నారు. పవన్‌కు తామంతా అండగా ఉంటామని చెప్పారు. 

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజుపై కూడా మరోసారి కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పుపై అభ్యంతరం వ్యక్తం చేసిన కన్నా లక్ష్మీనారాయణ.. తాను నియమించినవారినే సోము వీర్రాజు తొలగిస్తున్నారని అన్నారు. అధ్యక్షుల మార్పుపై తనతో చర్చించలేదని తెలిపారు. తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీజేలో చేర్పించానని.. ఇప్పుడు వాళ్లంతా పార్టీని వీడుతున్నారని అన్నారు. తన వియ్యంకుడు బీఆర్‌ఎస్‌లో చేడంపై ఏమంటారో సోము వీర్రాజునే అడగాలని అన్నారు. 

click me!