భావ ప్రకటనా స్వేచ్ఛా...అదెక్కడుంది?

First Published May 18, 2017, 5:02 PM IST
Highlights

మీడియా సమావేశాల్లో ఎవరైనా తనకు ఇబ్బది కలిగించే ప్రశ్నలు వేస్తే వెంటనే సదరు విలేకరిపై చంద్రబాబు అంతెతున లేస్తున్నది వాస్తవం కాదా? ప్రశ్న వేస్తేనే సహించలేని ముఖ్యమంత్రి ఇక భావప్రకటనా స్వేచ్ఛకు విలువ ఇస్తారంటే ఎవరైనా నమ్ముతారా?

పరకాల ప్రభాకర్ పెద్ద జోక్ పేల్చారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు ప్రభుత్వం భావప్రకటనా స్వేచ్ఛకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ జస్టిస్ మార్కెండేయ కట్జూ రాష్ట్రపతి, ప్రధానమంత్రులకు రాసిన లేఖపై పరకాల ఈరోజు స్పందించారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు తగిన ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి అనేక వేదికలపై చెప్పారని పరకాల చెప్పటం విచిత్రంగా ఉంది.  

చంద్రబాబు కోరుకునేది ఎటువంటి బావప్రకటనా స్వేచ్ఛో అందరికీ తెలిసిందే. ఎవరైనా ప్రభుత్వంపై వ్యతిరేక వార్తలు రాస్తే వారి ఉద్యోగాలు ఊడబీకే దాకా టిడిపి వాళ్ళు ఊరుకోరు. అంతెందుకు మీడియా సమావేశాల్లో ఎవరైనా తనకు ఇబ్బది కలిగించే ప్రశ్నలు వేస్తే వెంటనే సదరు విలేకరిపై చంద్రబాబు అంతెతున లేస్తున్నది వాస్తవం కాదా? ప్రశ్న వేస్తేనే సహించలేని ముఖ్యమంత్రి ఇక భావప్రకటనా స్వేచ్ఛకు విలువ ఇస్తారంటే ఎవరైనా నమ్ముతారా?

‘నీ అజెండా ఏంటి, నీదే పేపర్ ఏంటి’ అంటూ ఎన్నిసార్లు చిందులేయలేదు. అదేనా భావ ప్రకటనా స్వేచ్ఛకు విలువ ఇవ్వటమంటే? నిర్మాణాత్మక విమర్శలు చేయటాన్ని తమ ప్రభుత్వం ఆహ్వానిస్తుందట. నిర్మాణాత్మకం అంటే ఏమిటో? వారు మెచ్చిందే నిర్మాణాత్మకం. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని, కుటుంబ సభ్యులను అసభ్యంగా చూపిస్తూ కార్టూన్లు వేయటాన్ని ఎవరూ సహించరు. అలా వేయటం తప్పే.

చంద్రబాబు, లోకేష్ పైన వస్తున్న కార్టూన్లలో కొన్ని సృతిమించుతున్న మాట వాస్తవమే. ఎవరూ కాదనలేరు. అదే సమయంలో జగన్, షర్మిలను లక్ష్యంగా చేసుకుని టిడిపి వెబ్ సైట్లోను, సోషల్ మీడియా మద్దతుదారులు వేస్తున్న కార్టూన్ల మాటేమిటి? ఆ విషయమై వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదు చేసినా ఎవరిపైనా ఎందుకు చర్యలు తీసుకోలేదు? రవికిరణ్ పై 2014లో జీకె వీధిలో వైసీపీ వాళ్ళే ఫిర్యాదు చేసారని పరకాల చెప్పటంలో అర్ధమేమిటి?  జగన్, షర్మిలకు వ్యతిరేకంగా టిడిపి వెబ్ సైట్లో వస్తున్న కార్టూన్లపై ఎందుకు మాట్లాడటం లేదు?

click me!