ఏపీ మొత్తం సీఎం జ‌గ‌న్ సొంతమా ? - ఎంపీ రఘురామకృష్ణరాజు

By team teluguFirst Published Jun 23, 2022, 9:53 AM IST
Highlights

తన నియోజకవర్గానికి రావొద్దని సీఎం జగన్ చెబుతున్నారని, రాష్ట్రం మొత్తం ఏమైనా ఆయన సొంతమా అని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎంపై విమర్శలు చేశారు. 

ఏపీ మొత్తం సీఎం జ‌గ‌న్ (cm jagan) సొంతమా అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghurama Krishnaraju)  ప్ర‌శ్నించారు. త‌న నియోజ‌వ‌ర్గానికి త‌న‌ను ఎందుకు వెళ్లొద్ద‌ని చెబుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎంపీగా త‌న హ‌క్కుల‌ను సీఎం హరిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. బుధ‌వారం రఘురామకృష్ణరాజు ఢిల్లీ (Delhi)లో మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా సీఎంపై ఆయ‌న తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. 

Atmakur Bypoll: కొనసాగుతున్న ఆత్మకూరు ఉపఎన్నిక‌ పోలింగ్.. బరిలో 14 మంది అభ్యర్థులు

‘‘ నా లోక్ స‌భ స్థానానికి నేను వెళ్లాలంటే సీఎంకు ఎందుకు న‌చ్చ‌డం లేదో నాకు అర్థం కావడం లేదు. దీని వల్ల సీఎం కు వచ్చిన సమస్య ఏంటి ? నేను రాష్ట్రానికి రావొద్ద‌ని సీఎం చెప్పార‌ని, నా తోటి ఎంపీలు చెప్పారు.’’ అని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) ఏమైనా సీఎం జ‌గ‌న్ కు సొంత‌మా అని ఆయన ప్ర‌శ్నించారు. సీఎం ఎలా చెబితే పోలీసులు అలాగే ప‌ని చేస్తున్నార‌ని ఆయ‌న తీవ్రంగా ఆరోపించారు. త‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు వ‌స్తే ఆరెస్టు చేయాల్సి ఉంటుంద‌ని Law Justice and Public Grievance Committee మెంబర్లకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసులు చెప్పార‌ని అన్నారు. 

‘‘ నేను అనుకుంటే ఒక్క రోజైనా సీఎం అవుతాను’’- గాలి జనార్థన్ రెడ్డి

త‌మ Law Justice and Public Grievance Committee ఏపీలోని విశాఖపట్నంలో సమావేశం అవ్వాల్సి ఉందని అన్నారు. అయితే ఈ విషయాన్ని ఆ గ్రీవెన్స్ కమిటీ సభ్యులు ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (DGP) దృష్టికి తీసుకెళ్తే, ఆ క‌మిటీలో త‌ను ఉంటే దానిని పోస్ట్ పోన్ చేసుకోవాల‌ని చెప్పార‌ని త‌న స‌భ్యులు తెలియ‌జేశార‌ని  అన్నారు. తాను వెళ్తే అరెస్టు చేస్తామ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశార‌ని ఆరోపించారు. త‌రువాత ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంద‌ని తెలిపార‌ని చెప్పారు. ఒక మెంబ‌ర్ ఆఫ్ పార్ల‌మెంట్ రైట్స్ ను తొల‌గిస్తున్న ఏపీ పోలీసుపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. 

జగన్ సర్కార్‌కి షాక్.. అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట, గోడ నిర్మాణానికి అనుమతి

తనను అడ్డుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బ‌తీయ‌కూడద‌ని ర‌ఘురామ‌కృష్ణ రాజు సీఎంకు సూచించారు. స్వ‌తంత్ర స‌మ‌ర‌యోధుడు, అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraju)  125వ జయంతి ఉత్స‌వాలు త‌మ గ్రామంలో జ‌రుతాయ‌ని ఆయ‌న చెప్పారు. ఈ సంద‌ర్భంగా అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హావిష్క‌ర‌ణ ఉంటుంద‌ని తెలిపారు. దీనిని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ప్రారంభిస్తార‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మం త‌న ఇంటి స‌మీపంలోనే జ‌రుగుతుంద‌ని అన్నారు. అయితే ఈ కార్య‌క్ర‌మానికి త‌న‌ను హాజ‌రుకాకూడద‌ని చెప్ప‌డం స‌రికాద‌ని అన్నారు. స్థానిక ఎంపీగా అక్క‌డ ఉండ‌టం ప్రొటోకాల్ అని తెలియ‌జేశారు. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం హాజ‌రుకాక‌పోయినా ప‌ర‌వాలేద‌ని, కానీ తాను మాత్రం అక్క‌డ ఉండాల‌ని అన్నారు. ఎన్నో కేసుల్లో అభియోగాలు ఉన్న సీఎం విదేశాల‌కు వెళ్లి వ‌స్తున్నారని, కానీ తాను మాత్రం త‌న నియోజ‌క‌వ‌ర్గానికి ఎందుకు వెళ్ల‌కూడ‌ద‌ని ఆయన ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

click me!