‘‘ నేను అనుకుంటే ఒక్క రోజైనా సీఎం అవుతాను’’- గాలి జనార్థన్ రెడ్డి

Published : Jun 23, 2022, 08:54 AM IST
‘‘ నేను అనుకుంటే ఒక్క రోజైనా సీఎం అవుతాను’’- గాలి జనార్థన్ రెడ్డి

సారాంశం

తనకు పదవులపై, డబ్బుపై ఇంట్రెస్ట్ లేదని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి అన్నారు. ఉంటే ఒక్క రోజైనా సీఎం అవుతానని ఆయన స్పష్టం చేశారు. తన సోదరుడి పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

త‌న‌కు పదవులపై ఎలాంటి ఆశా లేద‌ని క‌ర్ణాట‌క మాజీ మంత్రి గాలి జ‌నార్థ‌న్ రెడ్డి అన్నారు. గ‌నుల అక్ర‌మ త‌వ్వ‌కాల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఆయ‌న.. త‌న సోద‌రుడు గాలి సోమ‌శేఖ‌ర్ రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌ల‌కు హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మం బ‌ళ్లారి లోని ఓ ఫంక్ష‌న్ హాల్ లో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గాలి జ‌నార్థ‌న్ రెడ్డి ఫంక్ష‌న్ కు హాజ‌రైన ప్ర‌జ‌లను ఉద్దేశించి మాట్లాడారు.

konaseema violence: మరో 18 మంది అరెస్ట్.. నిందితుల్లో ఒక మైనర్, 217కి చేరిన అరెస్ట్‌ల సంఖ్య

రెడ్డి సోదరుల‌కు, అలాగే శ్రీరాములుకు మ‌నీపై ఆశ లేద‌ని అన్నారు. ఎమ్మెల్యే కావాల‌ని లేద‌ని తెలిపారు. మంత్రి కావాల‌ని కూడా లేద‌ని చెప్పారు. అలాంటి ఆశ‌లు ఉంటే తాను ఒక్క రోజు అయినా సీఎం అవుతానని అన్నారు. త‌న‌ను ఇబ్బందులు పెట్టాల‌ని కొంద‌రు అనుకున్నార‌ని తెలిపారు. ఈ విష‌యాన్ని సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్లే త‌న‌తో చెప్పార‌ని గాలి జ‌నార్థ‌న్ రెడ్డి చెప్పారు. అయితే తాను ఒక్క రోజు అయినా సీఎం అవుతాన‌ని చెప్పిన కొన్ని క్ష‌ణాల‌లోనే అక్క‌డున్న ప్ర‌జ‌లు, కార్య‌క‌ర్త‌లు ఆయన‌పై పూల వ‌ర్షం కురిపించారు. 
 

PREV
click me!

Recommended Stories

Chandrababu Launches Anna Canteen: అన్న క్యాంటీన్’ ప్రారంభించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu
CM Chandrababu: అన్న క్యాంటీన్లో అన్నం వడ్డించి ముచ్చటించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu