పిచ్చివాడిగా ముద్రవేసి తనను చంపాలనుకొన్నారని సస్పెన్షన్‌కు గురైన డాక్టర్ సుధాకర్ సంచలన ఆరోపణలు చేశారు. గురువారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. తనపై కుట్ర జరుగుతోందని ఆయన పునరుద్ఘాటించారు.
విశాఖపట్టణం: పిచ్చివాడిగా ముద్రవేసి తనను చంపాలనుకొన్నారని సస్పెన్షన్‌కు గురైన డాక్టర్ సుధాకర్ సంచలన ఆరోపణలు చేశారు. గురువారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. తనపై కుట్ర జరుగుతోందని ఆయన పునరుద్ఘాటించారు.
undefined
మానసిక వైద్యశాఖలో డాక్టర్లు తనను ఇబ్బంది పెట్టారని ఆయన ఆరోపించారు. పిచ్చివాడిగా ముద్రవేసి చంపాలనుకొన్నారని ఆయన ఆరోపించారు. ఉద్యోగం వస్తోందనే గ్యారంటీ కూడ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
also read:ట్విస్ట్: ఆస్పత్రి నుంచి నేరుగా అజ్ఞాతంలోకి డాక్టర్ సుధాకర్
వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే తనకు చాలా అభిమానమన్నారు. వైఎస్ పాదయాత్రలో తాను కూడ పాల్గొన్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు.
తనకు ఉద్యోగం ఇస్తే కేస్ ఉపసంహరించుకొంటానని ఆయన స్పష్టం చేశారు.తన కారులోనే ఏటీఎం కార్డు ఉందన్నారు. ఈ కార్డును కూడ సీబీఐ అధికారులకు అందించినట్టుగా స్థానిక పోలీసులు తనకు చెప్పారన్నారు. ఏటీఎం కార్డును బ్లాక్ చేయాలని భావిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.
also read:ఆసుపత్రి నుండి డాక్టర్ సుధాకర్ డిశ్చార్జికి హైకోర్టు అనుమతి, కానీ...
గత నెల 16వ తేదీన విశాఖపట్టణం రోడ్డుపై డాక్టర్ సుధాకర్ ప్రత్యక్షమయ్యాడు. మద్యం తాగి రోడ్డుపై రభస చేయడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే సమయంలో డాక్టర్ పై కానిస్టేబుల్ దాడి చేయడంతో అతడిని విధుల నుండి తప్పించారు.
మరో వైపు ఈ ఘటనపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అనిత రాసిన లేఖపై ఏపీ హైకోర్టు విచారణ చేసింది. ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ఈ విషయమై సీబీఐ విచారణను కొనసాగిస్తోంది.