ఆ దేశాల నుండి ఏపికి చార్టెడ్ ప్లైట్స్... అనుమతివ్వండి: కేంద్ర విదేశాంగ మంత్రికి జగన్ లేఖ

By Arun Kumar PFirst Published Jun 11, 2020, 12:51 PM IST
Highlights

లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న వారిని రాష్ట్రానికి రప్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. 

అమరావతి: లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న వారిని రాష్ట్రానికి రప్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే కేంద్రం ''వందే భారత్'' మిషన్ పేరుతో  ప్రత్యేక విమానాల్లో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువస్తోంది. అయితే కేంద్రం చొరవ తీసుకున్నా విదేశాల్లో ఇంకా చాలా మంది రాష్ట్రానికి చెందిన వారు వున్నారని... వారిని తీసుకువచ్చేందుకు తమకు అనుమతులివ్వాలని కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యమ్ జయశంకర్ ని సీఎం జగన్ కోరారు. ఈ మేరకు విదేశాంగ మంత్రికి లేఖ రాశారు జగన్. 

''వందే భారత్'' ఆపరేషన్స్ లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ కు వస్తున్న విమానాలు చాలా తక్కువగా వున్నాయని... వాటి సంఖ్యను పెంచి విలైనంత ఎక్కువమందిని తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని జగన్ సూచించారు. అలాగే కిర్గిస్థాన్, యూఏఈ, ఖతార్, సౌదీ అరెబియా,సింగపూర్ ల నుండి చార్డెట్ ప్లైట్స్ లో రావడానికి రాష్ట్రవాసులు సిద్దంగా వున్నారని... వారిని అనుమతించాలంటూ కోరారు. 

read more  కువైట్ నుండి విశాఖకు చేరుకున్న 114 మంది తెలుగువారు..

వందే భారత్ మిషన్ పేరుతో విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తీసుకువస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలు అభినందనీయం. అయితే ఇందులో భాగంగా ఏపీకి చాలా తక్కువ విమానాలను కేటాయించారు. వీటి సంఖ్యను పెంచాల్సిన అవసరం వుంది. వివిధ దేశాల్లోని తెలుగు అసోసియేషన్స్ నుండి చార్టెడ్ ప్లైట్స్ ను అనుమతించాలని అభ్యర్ధనలు వస్తున్నాయి. విదేశాల నుండి  ఎంత మంది తెలుగువారు ఏపికి వచ్చినా అనుమతిస్తామని... వారు వందేభారత్ విమానంలోనే కాదు  చార్టెడ్ ప్లైట్స్ లో వచ్చినా పరవాలేదని జగన్ విదేశాంగ మంత్రికి రాసిన లేఖలో పేర్కోన్నారు. 


 

click me!