ఏపీలో కరోనా విజృంభణ: 5429కి చేరిన పాజిటివ్ కేసులు, 80 మరణాలు

By telugu teamFirst Published Jun 11, 2020, 12:35 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణకు బ్రేకులు పడడం లేదు. తాజాగా గత 24 గంటల్లో 182 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు మరణించారు. దీంతో మరణాల సంఖ్య 80కి చేరుకుంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి కావడం లేదు. ప్రతి రోజూ వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి. విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారి వల్ల కూడా కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులపై, మరణాలపై గురువారం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.

తాజాగా గత 24 గంటల్లో మొత్తం 182 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు మరణించారు. దాంతో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5429కి చేరుకోగా, మరణాలు 80కి చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారిలో 135 మందికి కొత్తగా కరోనా వైరస్ నిర్ధారణ అయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో గత 24 గంటల్లో 38 మందికి కరోనా సోకినట్లు తేలింది. విదేశాల నుంచి వచ్చినవారిలో 9 మందికి కోవిడ్ -19 పాజిటివ్ నిర్ధారణ అయింది. 

 

: as on 11/06/2020, 10:00AM
Positive Cases: 4261
Discharged: 2540
Deceased: 80
Active: 1641 pic.twitter.com/EsCn5KhhQ9

— ArogyaAndhra (@ArogyaAndhra)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 11,602 శాంపిల్స్ ను పరీక్షించగా 135 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. 65 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ వల్ల తూర్పూ గోదావరి జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో మరొకరు మరణించారు. రాష్ట్రానికి చెందినవారిలో మొత్తం 4261 మందికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. వారిలో 2540 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ కాగా, 1641 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

ఇదిలావుంటే, విదేశాల నుంచి వచ్చినవారిలో 197 మందికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. గత 24 గంటల్లో ముగ్గురు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 971 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో 31 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసులు 564 ఉన్నాయి.

 

pic.twitter.com/EUfBqivSEt

— ArogyaAndhra (@ArogyaAndhra)

 

click me!