డాక్టర్ సుధాకర్ రావు మద్యం తాగాడు, మానసిక ఆసుపత్రిలో చికిత్స: కేజీహెచ్ సూపరింటెండ్ అర్జున్

By narsimha lode  |  First Published May 17, 2020, 1:21 PM IST

డాక్టర్ సుధాకర్ రావు మద్యం సేవించి ఉన్నట్టుగా ప్రాథమికంగా నిర్ధారణ అయిందని కేజీహెచ్ ఆసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ జి. అర్జున్ చెప్పారు. 


విశాఖపట్టణం: డాక్టర్ సుధాకర్ రావు మద్యం సేవించి ఉన్నట్టుగా ప్రాథమికంగా నిర్ధారణ అయిందని కేజీహెచ్ ఆసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ జి. అర్జున్ చెప్పారు. డాక్టర్ సుధాకర్ రావు శనివారం నాడు సాయంత్రం విశాఖపట్టణంలో రోడ్డుపై అర్ధనగ్నంగా ప్రత్యక్షమయ్యాడు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.

డాక్టర్ సుధాకర్ రావును శనివారం నాడు సాయంత్రం ఆరున్నర గంటలకు ఆసుపత్రికి తీసుకు రావడంతో క్యాజువాలిటీ విభాగంలో పరీక్షించినట్టుగా ఆయన తెలిపారు. డాక్టర్ సుధాకర్ రావు మద్యం సేవించి ఉండడంతో అందరిని అసభ్య పదజాలంతో తిడుతూ వైద్యానికి సహకరించలేదన్నారు. అయినా కూడ అతి కష్టం మీద పల్స్, బీపీలను పరీక్షించినట్టుగా ఆయన వివరించారు.

Latest Videos

also read:డా. సుధాకర్ ను తాళ్లతో కట్టి లాఠీలతో కొడుతారా: నక్కా ఆనందబాబు

మద్యం మత్తులో ఉన్న కారణంగా రక్తంలో మద్యం శాతం పరీక్ష నిమిత్తం ఎఫ్ఎస్ఎల్ కు పంపినట్టుగా సూపరింటెండ్ డాక్టర్ అర్జున్ ఓ ప్రకటనలో వివరించారు. తదుపరి చికిత్స నిమిత్తం ప్రభుత్వం అతడిని మానసిక ఆసుపత్రికి తరలించామన్నారు. 

డాక్టర్ సుధాకర్ రావు ఎక్యూట్ హ్యాండ్ సైకోసిస్ తో బాధపడుతున్నట్టుగా ప్రాథమికంగా నిర్ధారించామని వాల్తేర్ మానసిక ఆసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ రాధారాణి చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ సుధాకర్ రావుకు చికిత్స నిర్వహిస్తున్నట్టుగా ఆమె చెప్పారు.
 

click me!