డాక్టర్ రామకృష్ణంరాజు ఫ్యామిలీ సూసైడ్: ఒకరి అరెస్ట్

By narsimha lodeFirst Published Sep 3, 2019, 12:00 PM IST
Highlights

అమలాపురంలోని ప్రముఖ ఎముకల వైద్యుడు డాక్టర్ రామకృష్ణం రాజు కుటుంబం ఆత్మహత్య  కేసులో  ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

అమలాపురం:  అమలాపురం పట్టణానికి చెందిన ప్రముఖ ఎముకల వైద్యుడు డాక్టర్ రామకృస్ణంరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రసాద్‌ అనే వ్యక్తిని పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్  చేశారు.

డాక్టర్ రామకృష్ణం రాజు చిన్న కొడుకు వంశీకృష్ణం రాజు రైసు పుల్లింగ్ ముఠా  కారణంగానే తమ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేశారు.

ఈ దర్యాప్తులో భాగంగా కృష్ణా జిల్లాకు చెందిన వేణుధర  వెంకట ప్రసాద్ ను  పోలీసులు అరెస్ట్ చేశారు.  రైస్ పుల్లింగ్ పేరుతో  డాక్టర్ రామకృష్ణం రాజు నుండి వేణుధరప్రసాద్ ముఠా రూ. 5 కోట్లు లాగినట్టుగా బాధితుడి కుటంబం ఆరోపిస్తోంది. ఈ కేసులో వేణుధరప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినా కూడ ఈ ముఠా బెదిరింపులకు పాల్పడింది. దీంతో చేసేదేమీ లేక డాక్టర్ రామకృష్ణంరాజు తన భార్య, కొడుకులకు విషమిచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్న కొడుకును కూడ చనిపోవాలని రావాలని కోరారు. కానీ చనిపోవద్దని చిన్న కొడుకు వంశీకృష్ణంరాజు బతిమిలాడాడు. కానీ వాళ్లు తమ ప్రయత్నాలను విరమించుకోలేదు.

సంబంధిత వార్తలు

డాక్టర్ ఫ్యామిలీ ఆత్మహత్యలో రైస్ పుల్లింగ్ ట్విస్ట్
అమలాపురంలో డాక్టర్ కృష్ణంరాజు కుటుంబం ఆత్మహత్య

click me!