ప్రముఖ డాక్టర్ కి కరోనా...ఇటీవల విజయసాయిని కలిసిన డాక్టర్

By Arun Kumar PFirst Published Jul 13, 2020, 9:58 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో హాస్పిటల్ నిర్వహిస్తున్న ప్రముఖ వైద్యునికి కరోనా సోకింది.

శ్రీకాకుళం: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో హాస్పిటల్ నిర్వహిస్తున్న ప్రముఖ వైద్యునికి కరోనా సోకింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న అతడికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. దీంతో జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆయన నిర్వహిస్తున్న ఆసుపత్రిని తాత్కాలికంగా మూసివేశారు జిల్లా అధికారులు.

అయితే సదరు డాక్టర్ కు పలువురు రాజకీయ నాయకులతో సంబంధాలున్నారు. దీంతో జిల్లా రాజకీయాల్లో కలవరం మొదలయ్యింది. ఈమధ్య ఆముదాలవలసలో జరిగిన ఓ సమావేశానికి ఈ డాక్టర్ హాజరయ్యారు. అదే సమావేశానికి జిల్లాకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో పాటు వైసిపి ఎంపీ విజసాయిరెడ్డి హాజరయ్యారు. తాజాగా డాక్టర్ కి కరోనా పాజిటివ్ గా తేలడంతో వీరిలోనూ ఆందోళన మొదలయ్యింది. 

read more  జీహెచ్ఎంసీలో తగ్గని ఉధృతి: తెలంగాణలో 36,221కి చేరిన కరోనా కేసులు

ఇక ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఒక్క రోజులో 2 వేలకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా గత 24 గంటల్లో ఏపీలో మొత్తం 1935 కేసులు నమోదయ్యాయి. ఏపీ స్థానికుల్లో 1919 మందికి కరోనా వైరస్ పాజిటివ్ రాగా, విదేశాల నుంచి వచ్చినవారిలో 13 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. విదేశాల నుంచి వచ్చినవారిలో ముగ్గురికి కరోనా వైరస్ సోకింది. దీంతో గత 24 గంటల్లో మొత్తం 1935 కేసులు రికార్డయ్యాయి. 

గత 24 గంటల్లో ఏపీలో 36 మంది కోవిడ్ -19తో మృత్యువాత పడ్డారు. అనంతపురం జిల్లాలో ఆరుగురు మరణించారు. కర్నూలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నలుగురేసి మరణించారు. చిత్తూరు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురేసి మృత్యువాత పడ్డారు. కడప, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరేసి మరణించారు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కరేసి కరోనా వైరస్ వ్యాధితో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 365కి చేరుకుంది. 

గత 24 గంటల్లో 19,247 శాంపిల్స్ ను పరీక్షించగా 1,919 మందికి రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో 1030 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 11,73,096 శాంపిల్స్ పరీక్షించారు. రాష్ట్రంలో మొత్తం 14,274 మంది ఆస్పత్రుల్లో కరోనా వ్యాధికి చికిత్స పొందుతున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో ఇప్పటి వరకు మొత్తం 2416 మందికి కరోనా వైరస్ సోకింది. విదేశాల నుంచి వచ్చినవారిలో మొత్తం 432 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. 
 

click me!