అనర్హత పిటిషన్ బుట్టదాఖలు: ఎంపీ రఘురామకృష్ణంరాజు ధీమా

By narsimha lodeFirst Published Jul 13, 2020, 9:03 PM IST
Highlights

తనపై ఇచ్చిన అనర్హత పిటిషన్ బుట్టదాఖలు అవుతోందని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ధీమాను వ్యక్తం చేశారు. తనపై అనర్హత పిటిషన్ రాజ్యాంగ విరుద్దమని ఆయన ఆయన చెప్పారు. 

అమరావతి:తనపై ఇచ్చిన అనర్హత పిటిషన్ బుట్టదాఖలు అవుతోందని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ధీమాను వ్యక్తం చేశారు. తనపై అనర్హత పిటిషన్ రాజ్యాంగ విరుద్దమని ఆయన ఆయన చెప్పారు. 

కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాను నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సోమవారం నాడు కలిశారు. తనకు భద్రతను కల్పించాలని ఆయన హోం సెక్రటరీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

also read:రఘురామకృష్ణంరాజుపై ఫిర్యాదులు:హైకోర్టులో ఎంపీ క్వాష్ పిటిషన్లు

గతంలోనే తనకు భద్రతను కల్పించాలని రఘురామకృష్ణంరాజు కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ఈ విషయమై ఆయన చర్చించారు. పార్టీ ఎమ్మెల్యేలే నాపై తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. 

తప్పనిసరి పరిస్థితుల్లోనే భద్రత కల్పించాలని అడిగినట్టుగా ఆయన చెప్పారు. తన ముఖం, ఎత్తు నచ్చకపోతే అనర్హత కుదరదన్నారు. 

ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మంత్రి శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, ప్రసాదరాజులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరుతూ ఏపీ హైకోర్టులో రఘురామకృష్ణంరాజు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

click me!