జేసీకి షాక్: దివాకర్ ట్రావెల్ కు రూ. 100 కోట్ల జరిమానా, క్రిమినల్ కేసులు

By telugu team  |  First Published Feb 8, 2020, 2:47 PM IST

జేసీ దివాకర్ రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్ పై రూ.100 కోట్ల జరిమానా విధించే అవకాశం ఉందని రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ప్రసాద రావు చెప్పారు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.


అనంతపురం: టీడీపీ మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్ కు షాక్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ సమాయత్తమైంది. తప్పుడు సమాచారం ఇచ్చిన దివాకర్ టార్లెస్ పై దాదాపు రూ. 100 కోట్ల జరిమానా విధించే అవకాశం ఉందని ఆంద్రప్రదేశ్ రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ప్రసాద్ రావు చెప్పారు. 

దివాకర్ ట్రావెల్స్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా పోలీసులను కోరినట్లు ఆయన తెలిపారు. శనివారం మీడియాతో ఆయన ఆ విషయం చెప్పారు. 2017లో సుప్రీంకోర్టు పర్యావరణ పరిరక్షణ కోసం బీఎస్ - 3 వాహనాలను నిషేధిస్తూ తీర్పు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

Latest Videos

undefined

దాని ప్రకారం 2017 ఏప్రిల్ 1వ తేదీ నుంచి బీఎస్ -4 వాహనాలను మాత్రమే విక్రయించాలనే నిబంధన అమలులోకి వచ్చిందని, కానీ దానికి విరుద్ధంగా అనంతపురం జిల్లాలో 68 నిషేధిత బీఎస్ -3 వాహనాలను గుర్తించామని ఆయన చెప్పారు. అయితే వీటీని స్క్రాప్ కింద విక్రయించాలని అశోక్ లేలాండ్ కంపెనీ తమకు వివరాలు పంపిందని ఆయన చెప్పారు.

నాగాలాండ్ లో బిఎస్ - 3 వాహనాలను బీఎస్ 4గా మార్చారని, ఇందులో ఆరు వాహనాలను జేసీ దివాకర్ రెడ్డి అనుచరుడు చవ్వా గోపాల్ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ చేశారని, ఒక వాహనం దివాకర్ ట్రావెల్స్ సంస్థ జటాధర్ ఇండస్ట్రీస్ పేరిట రిజిస్టరైందని ఆయన చెప్పారు. మరో నాలుగు లారీలు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సతీమణి జేసీ ఉమారెడ్డి పేరు మీద రిజిష్టరయ్యాయని, దానిపై వన్ టౌన్ పోలీసులకు జేసీపై ఫిర్యాదులు అందాయని ఆయన వివరించారు. 

సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న జేసీ ట్రావెల్స్ పై విచారణ చేయాలని ఫిర్యాదు దారుడు కోరాడని ఆయన చెప్పారు  

click me!