సినిమాల్లో లాగా కాల్చిపారేయలేం: అత్యాచార ఘటనలపై వైఎస్ జగన్

By telugu team  |  First Published Feb 8, 2020, 1:50 PM IST

అత్యాచారాల కేసుల్లో నిందితులను కాల్చి పారేసే స్వేచ్ఛ మన చట్టాల్లో లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. రాజమండ్రిలో జగన్ దిశ పోలీసు స్టేషన్ ను ప్రారంభించి ప్రసంగించారు.


అమరావతి: అత్యాచారం కేసుల్లోని నిందితులను సినిమాల్లో మాదిరిగా కాల్చి పారేయలేమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. సినిమాల్లో మాదిరిగా కాల్చి వేసే స్వేచ్ఛ మన చట్టాల్లో లేదని ఆయన అన్నారు. రాజమండ్రిలో ఆయన శనివారం దిశ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన తర్వాత ప్రసంగించారు 

హైదరాబాదులో జరిగిన దిశ ఘటన తీవ్రంగా తనను కలచివేసిందని ఆయన అన్నారు. దోషులు ఎవరైనా నిర్దాక్షిణ్యంగా చట్టాలను ప్రయోగిస్తామని ఆయన చెప్పారు మహిళల భద్రత కోసమే దిశ చట్టం తెచ్చినట్లు ఆయన తెలిపారు. త్వరగా న్యాయం అందకపోతే చట్టాలపై నమ్మకం పోతుందని ఆయన అన్నారు.

Latest Videos

Also Read: మాట నిలబెట్టుకున్న జగన్: దిశా పోలీస్ స్టేషన్లు, దిశా యాప్ కూడా వచ్చేశాయ్

నలుగురు కలిసి తాగిన తర్వాత మనిషి రాక్షసుడవుతున్నాడని, చిన్నపిల్లలను కూడా వదలడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విచారణలకు ఏళ్లకు ఏళ్లు పడుతుంటే నేరాలు పెరిగిపోతున్నాయని ఆయన అన్నారు. త్వరగా న్యాయం అందకపోతే వ్యవస్థలో మార్పు వస్తుందని ఆయన అన్నారు.   

దిశ చట్టం దేశంలోనే కొత్త అధ్యాయమని ఆయన అన్నారు. మార్పు తీసుకురావాలనే ఆలోచనల్లోనంచి పుట్టిందే దిశ చట్టమని ఆయన అన్నారు. నేరం జరిగిన 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి న్యాయం చేసే విధంగా చట్టాన్ని రూపొందించామని ఆయన చెప్పారు.

click me!