తేలని వకీల్ సాబ్ పంచాయతీ: మళ్లీ కోర్టుకెక్కనున్న డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు

By Siva KodatiFirst Published Apr 11, 2021, 7:52 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా టికెట్ ధరల వ్యవహారం ఇంకా తేలలేదు. టికెట్ ధరల పెంపు కోసం హైకోర్టులో హౌస్‌ మోషన్ పిటిషన్ వేయాలని ఎగ్జిబిట్లరు, థియేటర్ల యాజమాన్యం నిర్ణయించింది.

తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా టికెట్ ధరల వ్యవహారం ఇంకా తేలలేదు. టికెట్ ధరల పెంపు కోసం హైకోర్టులో హౌస్‌ మోషన్ పిటిషన్ వేయాలని ఎగ్జిబిట్లరు, థియేటర్ల యాజమాన్యం నిర్ణయించింది.

కొత్త జీవో వచ్చే వరకు పాత ధరలు కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు హౌస్‌మోషన్‌లో కోరనున్నారు. ఇందుకు సంబంధించి ఈరోజు కానీ, రేపు కానీ పిటిషన్  వేసే అవకాశం వుంది. ఇప్పటికే ధరల పెంపెను రెండురోజులకు పరిమితం చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. 

జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా శుక్రవారం నాడు థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read:పంతం నెగ్గించుకున్న జగన్.. పవన్ వకీల్ సాబ్‌కు హైకోర్టు షాక్: టికెట్ రేట్లు పెంచొద్దంటూ తీర్పు

రాత్రికి రాత్రే బెనిఫిట్ షోలు వేయకూడదని, టికెట్స్ రేట్స్ పెంచకూడదని సర్కార్ తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి ఏకంగా జీవో ని జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

అయితే, ప్రభుత్వం తీరును సవాల్ చేస్తూ మూవీ డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్.. మూడు రోజులపాటు టికెట్స్ రేట్స్ పెంచుకోవచ్చని తీర్పు వెల్లడించింది.

ఏపీ సర్కార్ ఈ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారించిన డివిజన్ బెంచ్ ధర్మాసనం.. సింగిల్ బెంచ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. టికెట్ ధరల పెంపు కేవలం శనివారానికే వర్తింపజేయాలని స్పష్టం చేసింది

click me!