నేను హిందువునే.. ఇవిగో ఆధారాలు: సునీల్ డియోధర్‌కు గురుమూర్తి కౌంటర్

Siva Kodati |  
Published : Apr 11, 2021, 06:20 PM ISTUpdated : Apr 11, 2021, 06:21 PM IST
నేను హిందువునే.. ఇవిగో ఆధారాలు: సునీల్ డియోధర్‌కు గురుమూర్తి కౌంటర్

సారాంశం

తిరుపతి ఉప ఎన్నికలు వ్యక్తిగత ఆరోపణలతో వేడెక్కుతున్నాయి. వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి హిందువు కాదంటూ ట్వీట్ చేశారు బీజేపీ ఏపీ ఇన్‌ఛార్జ్ సునీల్ డియోధర్. దీనిపై స్పందించిన గురుమూర్తి.. తాను హిందువునేనని ఆధారాలు విడుదల చేశారు.

వైకుంఠ ఏకాదశి రోజున స్వామి వారిని దర్శించుకున్న వీడియోను విడుదల చేశారు. తిరుపతి ఉప ఎన్నిక నామినేషన్ దాఖలు చేసేముందు తమ వూరి గ్రామ దేవతలకు పూజలు చేసిన ఫోటోలను కూడా విడుదల చేశారు.

పది ఓట్ల కోసం బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు గురుమూర్తి. అంతకుముందు సునీల్ డియోధర్‌పై విరుచుకుపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గురుమూర్తికి మద్ధతుగా ఆదివారం వైసీపీ నేతలతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

కేంద్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏది బడితే మాట్లాడుతున్నారని.. సునీల్ డియోధర్ అనే వ్యక్తి మేఘాలయా ఇన్‌ఛార్జ్‌గా వున్నారని గుర్తుచేశారు. అక్కడ ఏం చేశారో ప్రజలందరికీ తెలుసునని రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. గురుమూర్తి కుటుంబ నేపథ్యం, మత సంబంధిత విషయాలు మాట్లాడటం సరికాదని.. అంత దిగజారి మాట్లాడిన అవసరం లేదంటూ కౌంటరిచ్చారు పెద్దిరెడ్డి. 
 
PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu