ఏపీలో కరోనా డేంజర్ బెల్స్: 24 గంటల్లో మూడు వేలు దాటిన కేసులు, మొత్తం 9,25,401కి చేరిక

By narsimha lode  |  First Published Apr 11, 2021, 5:09 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో3,495 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 9 లక్షల 25వేల 401 కి చేరుకొన్నాయి. 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో3,495 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 9 లక్షల 25వేల 401 కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో తొమ్మిది మంది మరణించారు. కరోనాతో చిత్తూరులో నలుగురు, గుంటూరు, కర్నూల్, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కరి చొప్పున మరణించారు.  .దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,300 కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,54,29,391 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 31,719 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో3,495 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో 1,198 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 97 వేల 147 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 20,954 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

Latest Videos

గత 24 గంటల్లో అనంతపురంలో 209, చిత్తూరులో 719,తూర్పుగోదావరిలో 041,గుంటూరులో 501, కడపలో 192,కృష్ణాలో 306, కర్నూల్ లో 191, నెల్లూరులో 190,ప్రకాశంలో 215, శ్రీకాకుళంలో 293, విశాఖపట్టణంలో 405, విజయనగరంలో 193,పశ్చిమగోదావరిలో 040కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -69,540 మరణాలు 609
చిత్తూరు  -94,160,మరణాలు 887
తూర్పుగోదావరి -1,25,817, మరణాలు 637
గుంటూరు  -82,043, మరణాలు 686
కడప  -56,866, మరణాలు 464
కృష్ణా  -52,817,మరణాలు 691
కర్నూల్  -63,063, మరణాలు 500
నెల్లూరు -65,013,మరణాలు 521
ప్రకాశం -63,735, మరణాలు 589
శ్రీకాకుళం -48,039,మరణాలు 350
విశాఖపట్టణం  -64,708,మరణాలు 586
విజయనగరం  -41,970, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,735, మరణాలు 542

 

 

: 11/04/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 9,22,506 పాజిటివ్ కేసు లకు గాను
*8,94,252 మంది డిశ్చార్జ్ కాగా
*7,300 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 20,954 pic.twitter.com/i92ac8ioRW

— ArogyaAndhra (@ArogyaAndhra)


 

click me!