అనంతపురంలో రోడ్డున పడ్డ వైసిపి విభేదాలు

First Published Oct 16, 2017, 3:45 PM IST
Highlights
  • అనంతపురం జిల్లా వైసీపీలోని వర్గాల మధ్య వివాదం రోడ్డున పడింది.  
  • రాజంపేట ఎంపి మిధున్ రెడ్డి, అనంతపురం నియోజకవర్గం నేత గున్నాధరెడ్డి వర్గాల మధ్య సోమవారం మధ్యాహ్నం హఠాత్తుగా ఘర్షణ చోటు చేసుకుంది.
  • అనంతపురం జిల్లా వైసీపీ సమావేశానికి ఎంపి హాజరయ్యారు.
  • అయితే, సమావేశానికి తమ వర్గానికి సమాచారం లేదన్న కారణంతో గుర్నాధరెడ్డి వర్గం గొడవ మొదలుపెట్టింది.

అనంతపురం జిల్లాలోని వైసీపీలోని వర్గాల మధ్య వివాదం రోడ్డున పడింది.  రాజంపేట ఎంపి మిధున్ రెడ్డి, అనంతపురం నియోజకవర్గం నేత గున్నాధరెడ్డి వర్గాల మధ్య సోమవారం మధ్యాహ్నం హఠాత్తుగా ఘర్షణ చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా వైసీపీ సమావేశానికి ఎంపి హాజరయ్యారు. అయితే, సమావేశానికి తమ వర్గానికి సమాచారం లేదన్న కారణంతో గుర్నాధరెడ్డి వర్గం గొడవ మొదలుపెట్టింది.

గుర్నాధరెడ్డి త్వరలో టిడిపిలో చేరుతారంటూ ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో తాను కూడా టిడిపిలో ఇమడలేకపోతున్నట్లు కొద్ది రోజుల క్రితమే గుర్నాధరెడ్డి స్వయంగా చెప్పారు. అందుకే గుర్నాధరెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనటం లేదు.

ఈ నేపధ్యంలోనే ఈరోజు జరిగిన సమావేశంలో రెడ్డి వర్గం గొడవ చేయటం గమనార్హం. పార్టీ నాయకత్వం అందరినీ కలుపుకుని వెళ్ళటం లేదంటూ గుర్నాధరెడ్డి వర్గం పెద్ద ఎత్తున వీరంగం చేసింది. ఎంపి వర్గం పైకి దూసుకువెళ్లారు. పరస్పరం తోపులాటలయ్యాయి. అంతేకాకుండా సమావేశంలో వేసిన కుర్చీలను ఎత్తి విసిరేసారు. కొన్నింటిని విరిచేసారు. దాంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సరే, వెంటనే పోలీసులు రావటంతో రెండు వాతావరణం సద్దుమణిగింది లేండి.

click me!