2023 తెలుగుదేశానికే ఎక్కువ లాభించిందా? వైసీపీకి ఎలా ఉంది?

By SumaBala BukkaFirst Published Jan 1, 2024, 10:45 AM IST
Highlights

స్కిల్ డెవల్మెంట్ స్కాం కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేయడం.. ప్రజల్లో టీడీపీపై సానుభూతి పెరిగింది. దీన్ని అలాగే 
కంటిన్యూ చేయాలని టిడిపి భావిస్తోంది.  

అమరావతి : కొత్త సంవత్సరం వచ్చేసింది. ఎన్నో ఆశలను మోసుకొచ్చింది. మరి గడిచిపోయిన సంవత్సరం మాటేమిటీ? ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన వేళ ఎవరికి కలిసొచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఇంకా కొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ఎలాంటి తప్పొప్పులతో అందివచ్చిన అవకాశాలను వాడుకున్నారో తెలుసా? టీడీపీకి 2023 బాగా కలిసి వచ్చింది. మరోవైపు అధికార వైసీపీ ఇబ్బందుల్లో పడింది.

ముందుగా టీడీపీకి ఎలా కలిసివచ్చిందో చూస్తే.. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ భారీ గెలుపు సాధించుకుంది. రాదనుకున్న ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఒక సీటు సాదించుకుంది. మరోవైపు స్కిల్ డెవల్మెంట్ స్కాం కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేయడం.. ప్రజల్లో టీడీపీపై సానుభూతి పెరిగింది. దీన్ని అలాగే కంటిన్యూ చేయాలని టిడిపి భావిస్తోంది.  

Latest Videos

గుంటూరులో ఉద్రిక్తత.. మంత్రి విడుదల రజిని ఆఫీసుపై టీడీపీ-జనసేన రాళ్లదాడి..

మరోవైపు జనసేనతో టిడిపి పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తు తో మరింతగా ప్రజల్లోకి వెళ్లడానికి టిడిపి సిద్ధమవుతోంది. టీడీపీ- జనసేన ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్న క్రమంలో వైసీపీయే టార్గెట్ గా... వైసీపీ కి  బలమైన జిల్లాలపై ఫోకస్ పెడుతున్నాయి. నిత్యం ప్రజల్లో ఉండేందుకు ఇరు పార్టీలు కార్యక్రమాలు రచిస్తున్నాయి.  

ఇప్పటికే విడుదల చేసిన మినీ మేనిఫెస్టోతో దూసుకుపోతోంది. జనవరిలో భారీ బహిరంగ సభలకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ బహిరంగ సభల్లో  చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఉమ్మడిగా పాల్గొన్ననున్నారు.  బహిరంగ సభల అనంతరమే ఇరు పార్టీలు అభ్యర్థులను  ఖరారు చేయనున్నారు. టీడీపీ- జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను  కూడా అప్పుడే విడుదల చేసే అవకాశం ఉంది. వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్  లక్ష్యంగా కలిసి నడుస్తున్నారు. 

ఇదిలా ఉంటే, 2023 అధికార పార్టీ అయిన వైసీపీకి కలిసిరాలేదనే చెప్పాలి. రాష్ట్రంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ  ఎన్నికల్లో ఘోర ఓటమి పాలయ్యింది.  ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లోను పరాజయం చవిచూసింది. మరోవైపు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ‘వైనాట్ 175’ పేరుతో గెలుపే లక్ష్యంగా కసరత్తు చేస్తోంది. అన్ని నియోజక వర్గాల్లో సర్వేలు చేయించి, దాని ఆధారంగా ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు, చేర్పులు చేస్తోంది. ఈ మార్పులు, చేర్పుల జాబితా కీలక దశకు చేరుకుంది. 

అభ్యర్థుల మార్పులు, చేర్పులతో వైసీపీలో అసంతృప్తులు పెరిగి పోతున్నాయి. పార్టీని వీడుతున్న సీనియర్ల సంఖ్య పెరిగింది. సభా వేదిక పైనుంచి బాహాటంగానే అధిష్టానంపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తీవ్ర అసంతృత్తులు,  ఆందోళనల మధ్య అభ్యర్థుల ఎంపిక కసరత్తు  కొనసాగుతుంది. 

నేతల అసంతృత్తులు ,ఆందోళనలతో పార్టీ పెద్దలు అయోమయంలో పడ్డారు. భవిష్యత్తు అంతా ముఖ్యమంత్రి జగన్ పై పెట్టుకునే పార్టీ పెద్దలు ముందుకు వెళుతున్నారు. గెలుపు కోసం వ్యూహాలు, ప్రతి వ్యూహాలు చేసుకుంటోంది పార్టీ.  ఈ క్రమంలోనే ఈ నెల మొత్తం ప్రజల్లోనే ఉండాలని నేతలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనాలని వెల్లడించారు. పెన్షన్ పంపిణీ, ఆసరా, చేయూత కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆదేశించింది. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అధిష్టానం నేతలకు చెబుతోంది.  

click me!